లేడీస్‌తో బాలకృష్ణ బిహేవియర్ అలాంటింది.. ఆసక్తికర విషయాలు బయటపెట్టిన పాకీజా

నందమూరి నట వారసుడిగా బాలకృష్ణ గొప్ప విజయమే సాధించారు. చిన్నతనం లోనే తండ్రి తారక రామారావుతో కలిసి షూటింగులకు వెలుతూ బాలనటుడిగా సినీ గడప తొక్కారు. అనంతరం హీరోగా 150కి పైగా సినిమాలు చేసి నందమూరి హీరోల్లోకెల్లా అశేష అభిమాన వర్గాన్ని సొంతం చేసుకున్నారు బాలకృష్ణ. ఆయన సినీ ప్రస్థానంలో కొన్ని వేల మంది నటీనటులతో ప్రయాణం సాగించి ఎన్నో మైలురాళ్ళు సొంతం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో ఆయన సెట్స్‌పై ఆడవారితో ఎలా ఉంటారనే విషయంపై నటి పాకీజా కొన్ని విషయాలు బయటపెట్టింది.

టాలీవుడ్‌లో హాస్యనటిగా పాకీజాకు ప్రత్యేక గుర్తింపు ఉంది. అప్పట్లో బి.గోపాల్ దర్శకత్వంలో మోహన్ బాబు హీరోగా తెరకెక్కిన 'అసెంబ్లీ రౌడీ'లో లేడీ కమెడియన్‌గా మెప్పించి భారీ క్రేజ్ కొట్టేసింది పాకీజా. అసెంబ్లీ రౌడీలో పాకీజాగా ఎపుడైతే నటించిందో ఆమె స్క్రీన్ నేమ్ కూడా అదే అయిపోయింది. ఆమె అసలు పేరు వాసుకీ అయినప్పటికీ.. పాకేజా గానే ఆమెకు గుర్తింపు వచ్చింది. లేడీ కమెడియన్‌గా తెలుగులో చాలా సినిమాల్లో నటించిన ఆమెకు 'రౌడీ ఇన్‌స్పెక్టర్','పెదరాయుడు'వంటి సినిమాల్లోని పాకీజా పండించిన హాస్యాన్ని ప్రేక్షకులు ఎప్పటికీ మరిచిపోలేదు.

Lady comedian Paakeeja comments on Balakrishnas behaviour

కాగా తాజాగా ఈటీవీలో ప్రసారమవుతున్న ఆలీతో జాలీగా ప్రోగ్రామ్ లో పాల్గొన్న ఈమె సీనియర్ హీరో బాలకృష్ణపై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనకు తెలుగు హీరోల్లోకెల్లా బాలయ్య బాబు అంటే ఎంతో ఇష్టమని ఆమె తెలిపింది. అంతేకాదు ఆయన సెట్‌లో ఆడవాళ్లతో ఎలా మెలిగే వారనే విషయాన్ని ఆమె చెప్పుకొచ్చింది. తన తోబుట్టువులతో ఎలా ఉండేవారో సెట్లో ఆడవాళ్లతో కూడా అలాగే బిహేవ్ చేసేవారని పాకీజా పేర్కొన్నారు. అప్పట్లో బాలకృష్ణ,చిరంజీవి,విజయశాంతి వంటి హీరో, హీరోయిన్స్ నటించిన విమానం ప్రమాదానికి గురైన సందర్భంలో అందులో తాను కూాడా ఉన్నట్లు పాకీజా తెలిపారు. ఆ సమయంలో ఆర్టిస్టులందరు భయపడొద్దని బాలయ్య అందరికీ ధైర్యం చెప్పాడని, అదే సమయంలో బాలకృష్ణ తనకు బాగా దగ్గరయ్యారని ఈ సందర్బంగా పాకీజా చెప్పుకొచ్చారు.

More from Filmibeat

Read more about: nandamuri balakrishna comments
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X