అష్టాచెమ్మా చిత్రంతో పరిచయమైన నాని తాజాగా మరో రెండు చిత్రాలు కమిట్ అయ్యాడు. అయితే విచిత్రంగా ఇద్దరూ కొత్తగా పరిచయమవుతున్న లేడీ డైరక్టర్స్ కావటం విశేషం. అందులో ఒకరు గౌతమ్ మీనన్ వద్ద పనిచేసిన అంజనా అలీ ఖాన్. ఆమె ఓ ఎంటర్టైన్మెంట్ సభ్జెక్టుతో తమిళ, తెలుగు భాషల్లో చిత్రం రూపొందించటానికి సన్నాహాలు చేస్తోంది. అలాగే నందిని రెడ్డి అనే కృష్ణవంశి అసెస్టెంట్ కూడా నాని తోనే సినిమా ప్లాన్ చేస్తోంది. ఆ చిత్రం రొమాంటిక్ కామిడి అని తెలుస్తోంది. అలాగే మరో మహిళా దర్శకురాలు బి.జయ కూడా నాని తో చిత్రం చేసే ఆలోచనలో ఉందని తెలుస్తోంది. అల్లరి నరేష్ తో సినిమా ఆగిన ఆమె ఈ నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది. ఇక నాని చేసిన స్నేహితుడా, రైడ్ రెండు చిత్రాలు ఈ నెలలోనే రిలీజ్ కానున్నాయి.