ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ కోసం పరితపిస్తున్న మహిళా అభిమాని.. కన్నీళ్లు తెప్పించేలా కారణం!

హీరోలు అంటే అభిమానులకు ప్రాణం. ఎనలేని ప్రేమ. వారికోసం ఏమైనా చేసేందుకు సిద్ధపడతారు. అయితే కొన్నిసార్లు వారి ప్రేమ హద్దులు దాటుంతుంటే ఒక్కోసారి హీరోల కోసం సైలెంట్ గా పరితపిస్తుంటారు. ఇక తెలుగు ప్రజల్లో పవర్​ స్టార్​ పవన్ కల్యాణ్​కు ఉన్న క్రేజ్​ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. హిట్​లు ఫ్లాప్​లు అంటూ తేడా లేకుండా ఎలాంటి క్రేజ్​ తగ్గని హీరో ఎవరైన ఉన్నారంటే అది పవన్​ కల్యాణ్​ అనే చెప్పవచ్చు. అయితే తాజాగా ఆయన కోసం ఓ లేడీ ఫ్యాన్ చాలా కాలంగా ఎదురుచూస్తోంది.

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ రాజకీయాల్లోకి ప్రవేశించిన తర్వాత సినిమాలకు కొంత కాలం గ్యాప్ ఇచ్చారు. కానీ ఇప్పుడు మాత్రం ఓవైపు పాలిటిక్స్ లో సూపర్ యాక్టివ్ గా ఉంటూనే మరోవైపు వరుస పెట్టి సినిమా చిత్రీకరణలో పాల్గొంటున్నారు. వకీల్ సాబ్ మూవీతో రీ ఎంట్రీ ఇచ్చిన పవన్ తర్వాత భీమ్లా నాయక్ తో బాక్సాఫీస్ వద్ద సందడి చేశారు. ఇప్పుడు ప్రముఖ డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో హరి హర వీరమల్లు సినిమాను చేస్తున్న విషయం తెలిసిందే.

Lady Fan Wants To Meet Power Star Pawan Kalyan Direct

హరి హర వీరమల్లు చిత్రాన్ని రెండు పార్టులుగా విడుదల చేసేందుకు దర్శక నిర్మాతలు ఆలోచిస్తున్నారు. ఈ సినిమానే కాకుండా పవన్ కల్యాణ్ వినోదయ సీతమ్ రీమేక్ మూవీ చేస్తున్నాడు. ఇక గబ్బర్ సింగ్ మూవీతో కెరియర్ రికార్డ్ ఇచ్చిన హరీష్ శంకర్ డైరెక్షన్ లో ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రం, యంగ్ డైరెక్టర్ సుజీత్ దర్శకత్వంలో ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్ (OG) సినిమా కూడా చేస్తున్నడు పవన్ కల్యాణ్. సినిమాలతో ఫుల్ బిజీగా ఉండే ఆయన్ను కలిసేందుకు ఓ అభిమాని ఆరాటపడుతోంది.

Lady Fan Wants To Meet Power Star Pawan Kalyan Direct

చిత్తూరు జిల్లాలోని ఐరాల మండలం చంద్రయ్యగారిపల్లికి చెందిన అనూష కొద్ది కాలంగా అనారోగ్యంతో బాధపడుతోంది. పవన్ కల్యాణ్ అంటే అమితమైన అభిమానం ఉన్న ఆమె ఆయన్ను నేరుగా ఒక్కసారైనా చూడాలని కోరుకుంటోంది. అనూష మూడేళ్లుగా అనారోగ్యంతో బాధపడుతోందని, జనసేన అధినేత పవన్ ను నేరుగా చూడాలని పరితపిస్తోందని, తన కోరికను మన్నించి పవన్ కల్యాణ్ అవకాశం కల్పించాలని ఆమె తల్లి వేడుకుంది. ఈ విషయాన్ని పవన్ కల్యాణ్ దృష్టికి తీసుకెళ్లారో లేదో తెలియదు గానీ, ఆమె కారణం, ఆయన్ను కలవలాన్న కోరిక పలువురిని కంటతడి పెట్టిస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X