లేడీ డైరెక్టర్, నిర్మాత భార్య..., టాలీవుడ్లో ఇలాంటి మహిళలూ ఉన్నారు, జాగ్రత్త!

By Bojja Kumar

సినిమా పరిశ్రమలో ఈ మధ్య తరచూ లైంగిక వేధింపుల అంశాలు ప్రస్తావనకు వస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పలువురు హీరోయిన్లు ఇలాంటి సంచలన విషయాలు బయటపెట్టారు. ఇటీవల హాలీవుడ్లో హార్వీ వెయిన్‌స్టన్ సంఘటన తర్వాత చాలా మందిలో చైతన్యం వచ్చింది. ప్రపంచ వ్యాప్తంగా లైంగిక వేధింపులు ఎదుర్కొన్న నటీమణులు, టెక్నీకల్ విభాగంలో పని చేసిన మహిళలు #MeToo పేరుతో సోషల్ మీడియాలో జరిగిన కాంపెయిన్లో తమ ఎదురైన లైంగిక వేధింపుల అనుభవాలను బయట పెట్టారు.

‘అర్జున్ రెడ్డి’ లిరిక్ రైటర్ శ్రేష్ఠ

‘అర్జున్ రెడ్డి’ లిరిక్ రైటర్ శ్రేష్ఠ

#MeToo కాంపెయిన్లో ‘పెళ్లి చూపులు', ‘అర్జున్ రెడ్డి' చిత్రాలకు పాటలు రాసిన లేడీ లిరిక్ రైటర్ శ్రేష్ఠ కూడా పాల్గొన్నారు. ఆమె ఇందులో పాల్గొనడానికి కారణం ఆవిడ కూడా ఇండస్ట్రీలో లైంగిక వేధింపులు ఎదుర్కోవడమే.

లిరిక్ రైటర్ శ్రేష్ఠ

లిరిక్ రైటర్ శ్రేష్ఠ

టాలీవుడ్లో లేడీ లిరిక్ రైటర్ల సంఖ్య చాలా తక్కువ. మగాళ్లు ఆధిపత్యం నడుస్తున్న ఈ విభాగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు శ్రేష్ఠ. ఆమె ‘పెళ్లి చూపులు' చిత్రంలో చినుకు తాకే, మరిసే మెరిసే పాటలు రాశారు. అదే విధంగా ‘అర్జున్ రెడ్డి' చిత్రంలో మధురం మధురం పాట రాశారు.

తనకు ఎదురైన లైంగిక వేధింపుల గురించి

తనకు ఎదురైన లైంగిక వేధింపుల గురించి

ఇటీవల ఇంటర్వ్యూలో శ్రేష్ట తనకు ఎదురైన లైంగిక వేధింపుల సంఘటన గురించి వెల్లడించారు. ఇండస్ట్రీలో పరాయి స్త్రీ శరారీలపై కన్నేసే కామాధులతో పాటు వారికి సహకరించే లేడీస్ కూడా ఉన్నారంటూ... శ్రేష్ఠ సంచలన విషయాలు బయట పెట్టారు.

గోవాకు పిలిచి ఆ లేడీ డైరెక్టర్

గోవాకు పిలిచి ఆ లేడీ డైరెక్టర్

ఓ సారి ఓ లేడీ డైరెక్టర్ తనను గోవాలో పార్టీ ఉందని పిలిపించిందని, అక్కడికి వెళ్లిన తర్వాత .... ఓ అబ్బాయి నీకు ప్రపోజ్ చేయాలనుకుంటున్నాడని చెప్పిందని, తర్వాత ఓ గుర్తు తెలియని వ్యక్తి తనకు ఫోన్ చేశాడని శ్రేష్ఠ తెలిపారు.

లేడీ డైరెక్టర్ దారుణం

లేడీ డైరెక్టర్ దారుణం

ఫోన్ చేసిన వ్యక్తి..... ఆ లేడీ డైరెక్టరే నిన్ను నాకు ఆఫర్ చేసిందని అని చెప్పడంతో షాకయ్యాను. ఇండస్ట్రీలోకి రావాలంటే ఇలాంటివన్నీ అలవాటు చేసుకోవాలని కూడా అతడు చెప్పాడు. ఇలాంటి పరిస్థితులకు భయపడి తాను కొంతకాలం ఇండస్ట్రీకి దూరంగా వెళ్లిపోయాను అని శ్రేష్ఠ తెలిపారు.

నిర్మాత భార్య కూడా...

నిర్మాత భార్య కూడా...

ఓ నిర్మాత భార్య కూడా.... తన భర్తకు ఆ విషయంలో సహకరించాలని అడిగిందని, ఆమె అలా అడగటం చూసి తాను షాకయ్యాను అని శ్రేష్ఠ తెలిపారు. అయితే ఆ దర్శకురాలు, నిర్మాత పేరు శ్రేష్ఠ బయట పెట్టలేదు.

ఇండస్ట్రీలో ఇలాంటి ఆడవాళ్లూ ఉన్నారు, జాగ్రత్త

ఇండస్ట్రీలో ఇలాంటి ఆడవాళ్లూ ఉన్నారు, జాగ్రత్త

లిరిక్ రైటర్ శ్రేష్ఠ చెప్పిన మాటలను బట్టి..... సినిమా ఇండస్ట్రీలో ఇలాంటి ఆడవాళ్లు కూడా ఉంటారా? అని పలువురు విస్తుపోతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X