ఆడపాండవులు!?
సమాజంలో స్త్రీజాతికి జరుగుతున్న అన్యాయాలకు, ఆకృత్యాలకు ఐదుగురు అమ్మాయిలు పడిన ఆవేదన, ఆ తర్వాత పరిణాలు నేపథ్యంగా రూపొందుతున్న 'ఆడపాండవులు' చిత్రం షూటింగ్ శుక్రవారం ఉదయం సారధి స్టూడియోలో మొదలైంది. నిర్మాత నల్లాని వెంకటరమణ నిర్మాణంలో శ్రీలక్ష్మీ మూవీ మేకర్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. వెంకటేష్ కే.ఆర్. దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో కవిత, శ్రీనివాసవర్మ, జీవా, అలీ, సుమన్‌శెట్టి, గౌతంరాజు, జూ.రేలంగి, కొండవలస, జీవి, రంగనాథ్, తెలంగాణ శకుంతల, అన్నపూర్ణ, రజిత తదితరులు నటిస్తున్నారు.
ఈ చిత్రం ముహూర్తపు సన్నివేశానికి మాడగుల నాగఫణిశర్మ క్లాప్ ఇచ్చారు. గోగిరెడ్డి శ్రీనివాస్ కెమెరా స్విచాన్ చేశారు. 'ఐదుగురు అమ్మాయిల ఆవేదన, ఆ ఆవేదనలోంచి వారికి ఎలాంటి ఆలోచన పుట్టింది. పర్వవసానంగా తమ జాతికి గౌరవం తెచ్చేలా వారేమి చేశారు అనే అంశాలు నేపథ్యంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్టు' దర్శకుడు వెంకటేశ్ చెప్పారు.నిర్మాత నల్లాని వెంకటరమణ మాట్లాడుతూ 'సింగిల్ షెడ్యూల్లో నిర్మాణం పూర్తిచేస్తామ'న్నారు. 'ఇది చిన్న చిత్రమైనప్పటికీ సందేశంతో పాటుగా వాణిజ్య అంశాలు ఉన్నాయి' అని నటి కవిత పేర్కొంది.


Click it and Unblock the Notifications











