twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఆందోళన చేస్తే భయపడతాననుకున్నారా: వర్మ

    By Sindhu
    |

    'బెజవాడ రౌడీలు' టైటిల్ ను ఎట్టి పరిస్థితులలోనూ మార్చేది లేదని తాను అనుకున్నది అనుకున్నట్లుగా అదే టైటిల్‌తో సినిమా తీసి తీరుతానని ఆ చిత్ర నిర్మాత రామ్ గోపాల్ వర్మ ఈ రోజు మరోసారి స్పష్టం చేశారు. చిత్రం టైటిల్ ను మారుస్తానని విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ కు తానెటువంటి హామీ ఇవ్వలేదని చెప్పారాయన. ఇందులో ఎవరినీ కించపరిచే సన్నివేశాలుండవని ఆయన అన్నారు. ఏ వర్గానికీ ఇది కొమ్ముకాయదన్నారు. ఈ చిత్ర కథతో తనకు సంబంధం లేదనీ, కథ దర్శకుడు వివేక్ సొంతమనీ వర్మ చెప్పారు.

    ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించి రెండో షెడ్యూలు గత నాలుగు రోజుల నుండి విజయవాడలో జరుగుతోంది. ఓ యూనిట్ తో గుంటూరు జిల్లా తాడేపల్లిలో ఓ పాటను చిత్రీకరిస్తుండగా, మరో యూనిట్ తో విజయవాడ సూర్యాపేటలో షూటింగ్ చేస్తున్నారు. తాను బెజవాడ రౌడీలు చిత్రంలో విజయవాడను కించపరిచే విధంగా ఎటువంటి సన్నివేశాలను చిత్రీకరించడంలేదని చెప్పినప్పటికీ గోల చేయడం ఏంటని వర్మ ప్రశ్నిస్తున్నారు. సినిమా తీశాక చూసి అందులో బెజవాడను విమర్శించినట్లుంటే అప్పుడు స్పందించాలని హితవు పలికారు.

    అంతేగాని ముందుగానే ఆందోళన చేస్తే దానికి భయపడిపోయే ప్రసక్తే లేదన్నారు. షూటింగ్ మొత్తాన్ని విజయవాడలోనే పూర్తి చేసి తీరుతానని ధీమా వ్యక్తం చేశారు. అనుమతి లేకుండా షూటింగ్ చేస్తున్నారన్న సమాచారం రావడంతో సూర్యాపేట పోలీసులు లొకేషన్ కెళ్ళి షూటింగును ఆపేశారు. అయితే, చిత్ర దర్శకుడు అనుమతి పత్రాలు చూపడంతో మళ్లీ షూటింగుకి అనుమతించి, పోలీసులు వెనుదిరిగారు.

    English summary
    Lagadapati Rajagopal, Congress MP from Vijaywada, recently said that producer Ram Gopal Varma promised him that he'd change the title of Bejawada Rowdilu in the wake of controversy. I am not going to change the title. The film is also not targeted at any living person or family. It is story that revolves around violent incidents in Vijaywada," RGV told the media. He came to Vijayawada to oversee the film's shoot being done by his protege debutant director Vivek.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X