బన్నీ, మనోజ్ సినిమాలతో సహా... 8 సినిమాలతో లగడపాటి
రామలక్ష్మీ క్రియేషన్స్ పతాకంపై సినిమాలను నిర్మించే లగడపాటి శ్రీధర్ మాట్లాడుతూ...'అల్లు అర్జున్ హీరోగా లింగుస్వామి దర్శకత్వంలో ఓ సినిమా ప్లాన్ చేసాం. అలాగే ఓ అగ్రహీరోతో సెల్వరాఘవన్ దర్శకత్వంలో ఓ సినిమా, ఓ అగ్రదర్శకుడితో మనోజ్ హీరోగా మరో సినిమా నిర్మించబోతున్నాం' అని తెలిపారు.
దీంతో పాటు 'పోటుగాడు' చిత్ర దర్శకుడు పవన్ డైరెక్షన్లో ఓ స్టార్ హీరోతో సినిమా చేయబోతున్నాం. అదే విధంగా పోటుగాడు సినిమాను రాఘవ లారెన్స్ దర్శకత్వంలో తమిళంలో రీమేక్ చేయబోతున్నాం. ఓ నూతన దర్శకుడితో కన్నడ చిత్రం, మరో నూతన దర్శకుడితో ఓ కుటుంబ కథా చిత్రం నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నాం' అన్నారు.
పోటుగాడు సినిమా విషయానికొస్తే...కన్నడ దర్శకుడు పవన్ వడెయార్ ఈచిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా, లగడపాటి శ్రీధర్ ఈచిత్రాన్ని రామ లక్ష్మి సినీ క్రియేషన్స్ నిర్మిస్తున్నారు. పోటుగాడు చిత్రానికి హాలీవుడ్ స్టంట్ మాస్టర్ పని చేస్తున్నారు. ఆసక్తికర విషయం ఏమిటంటే ఈ చిత్రంలో నలుగురు హీరోయిన్లు నటిస్తున్నారు. సాక్షి చౌదరి, సిమ్రాన్ ముండి, నథాలియా కౌర్ నటిస్తున్నారు. ఊకొడతారా ఉలిక్కి పడతారా చిత్రం తర్వాత మనోజ్ చేస్తున్న సినిమా ఇదే.


Click it and Unblock the Notifications
