Don't Miss!
- Finance IREDA: భారీగా లాభాలను ప్రకటించిన ఐఆర్ఈడీఏ..
- Sports సూపర్ మ్యాన్ జడేజా: గాల్లోకి డైవ్ చేస్తూ ఒంటిచేత్తో క్యాచ్ Video
- Automobiles మరింత తక్కువ ధరలో బజాజ్ చేతక్ ఇ స్కూటర్.. త్వరలో లాంచ్.!!
- Technology Dell నుంచి నాలుగు కొత్త Ai ల్యాప్టాప్లు! ధర,స్పెసిఫికేషన్లు
- News భారీ వర్షం - వాతావరణ శాఖ బిగ్ అలర్ట్..!!
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
నిర్మాత లగడపాటి శ్రీధర్ ఇక ధనాధన్
ఆర్ట్ డైరక్టర్ అశోక్ దర్శకత్వంలో స్టైల్ చిత్రం సీక్వెల్ అంటూ ఓ చిత్రాన్ని లగడపాటి శ్రీధర్ ప్రారంభిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రం దే దక్కా అనే మరాఠీ చిత్రం ఫ్రీమేక్ గా రూపొందుతోందని, అలాగే ఆస్కార్ విజేత లిటిల్ మిస్ సన్ షైన్ ఆధారంగా కొన్ని సన్నివేశాలు రూపొందుతున్నట్లు వినపడుతోంది. ఇక ఈ చిత్రానికి ధనాధన్ అనే టైటిల్ ని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. అలాగే ఓ టీవీ రియాలటి షో చుట్టూ ఈ కథ తిరగనుందని తెలస్తోంది. ఇందుకోసం ఆయన 10-14 సంవత్సరాల మధ్యగల క్లాసికల్ డాన్సర్స్ కోసం కాస్టింగ్ కాల్ ఇచ్చారు. అలాగే లగడపాటి గతంలో ఎవరి గోల వారిదే, స్టైల్ నిర్మించారు. ఇక దర్శకుడుగా మారుతున్న అశోక్...అరుంధతి, ఒక్కడు వంటి చిత్రాలకు ఆర్ట్ దర్శకత్వం వహించి నంది అవార్డులు అందుకున్నారు. కంప్లీట్ ఫ్యామిలీ మ్యూజికల్ ఎంటర్టైనర్ గా ఈ చిత్రాన్ని తీర్చిదిద్దనున్నట్లు చెప్తున్నారు. ఇక ఈ డాన్సర్స్ తప్పనిసరిగా కూచిపూడి మరియు భరతనాట్యంలో ప్రావీణ్యత కలిగి ఉండాలంటున్నారు.