రైటర్స్ కి నరకం చూపిస్తున్న తెలుగు ప్రొడ్యూసర్ !?

By Srikanya

ఎవడిగోల వారిదే,స్టైల్, స్నేహగీతం వంటి చిత్రాల నిర్మాత లగడపాటి శ్రీధర్ ఇప్పుడు ధనాధన్ టైటిల్ తో మరో చిత్రానికి అంకురార్పణ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఆయన సినిమా సంగతి ఎలా ఉన్నా తెలుగు రచయితలకు మాత్రం అది టార్చర్ లా మారిందని ఫిల్మ్ సర్కిల్స్ లో గత కొంత కాలంగా వినపడుతోంది.పేరుకు పెద్ద నిర్మాత అయినా టెక్నిషియన్స్ దగ్గరకు వచ్చేసరికి చాలా తక్కువ రెమ్యునేషన్స్ ఇస్తాడని టాక్ ఉన్న ఈయన ఇప్పుడు ఈ రకంగా కూడా వార్తల్లో వ్యక్తి అయ్యారు.

అందులోనూ రోజుకో ఐడియా వస్తుందని, దాన్ని ఎలాగయినా జరుగుతున్న ప్రాజెక్టులో పెట్టాలని ఆలోచిస్తూంటాడని,ఎక్కడా ఫిక్స్ కాడని దాంతో ఆయనతో పనిచేస్తున్న రచయితలకు నరకం కనిపిస్తుందని చెప్పుకుంటున్నారు. ఇప్పటికే చిన్నా చితకా చాలా మంది రైటర్స్ ఆయన పెద్ద ప్రొడ్యూసర్ కదా అన్న ఆశతో అక్కడికి వెళ్ళటం, ఆయన ఇస్తానన్న ఎమౌంట్ కి భయపడటం,అప్పటికీ ధైర్యం చేసి ముందుకెళ్ళినా ఆ తర్వాత ఆయన ఐడియాలతో పెట్టే టార్చర్ భరించటం కష్టం అంటున్నారు. గతంలోనూ బిందాస్,రగడలతో దర్శకుడుగా మారిన వీరూపోట్లతో సినిమా ప్రారంభిస్తానని ప్రకటించి చాలా కాలం పనిచేయించుకుని ఆ తర్వాత ఆయన చేతులెత్తేసాడు.

ఇప్పుడు కళా దర్శకుడు అశోక్ వంతు వచ్చింది. ఆయన శ్రీధర్ తో ధనాధన్ చిత్రం చేస్తున్నారు. అయితే చాలా కాలం నుంచి ఈ ప్రాజెక్టు నలుగుతోంది కానీ తెమలటం లేదు. అయితే ఈ చిత్రం దే దక్కా అనే మరాఠీ చిత్రం ఫ్రీమేక్ గా రూపొందుతోందని, అలాగే ఆస్కార్ విజేత లిటిల్ మిస్ సన్ షైన్ ఆధారంగా కొన్ని సన్నివేశాలు రూపొందుతున్నట్లు వినపడుతోంది. అలాగే ఓ టీవీ రియాలటి షో చుట్టూ ఈ కథ తిరగనుందని తెలస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X