లగడపాటి శ్రీధర్ త్వరలో స్టైల్-2 చిత్రానికి శ్రీకారం చుట్టతున్నారు. పూర్తి స్ధాయి డాన్స్ లతో ఎంటర్టైన్ మెంట్ కలగలపి ఈ చిత్రం తీయటానికి ప్లాన్ చేస్తున్నారు. అయితే ఇది ఇన్నోసెంట్ స్టెప్స్ అనే కొరియా చిత్రం ఆధారంగా రూపొందనుందని ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది. అలాగే హాలీవుడ్ మ్యాజికల్ ఫిల్మ్ స్టెప్ అప్ కూడా కలుస్తుందని అంటున్నారు.2005 లో వచ్చిన ఇన్నోసెంట్ స్టెప్స్ అప్పట్లో మంచి విజయాన్నే నమోదు చేసింది. మూడు నెలల్లో అసలు డాన్స్ రాని ఓ అమ్మాయిని కాంపిటేషన్లో నిలబెట్టి నెగ్గించటమే ఈ రొమాంటిక్ కామెడీలో జరిగేది. అయితే ఇది రూమర్ కూడా అయ్యే అవకాశం ఉంది. ఓ డాన్స్ డైరక్టర్ స్టైల్-2కి డైరక్షన్ వహించే అవకాశముందనేది టాక్. ఇక ప్రస్తుతం శ్రీధర్ స్నేహ గీతం చిత్రం హడావిడిలో ఉన్నారు. యువతను ఉత్తేజపరిచే అభిరుచితో ఢిపెరెంట్ చిత్రాలు తీయాలనేది ఆయన ఆకాంక్ష అని తెలుస్తోంది. ఆయన గతంలో ఎవరి గోల వారిదే, స్టైల్, వియ్యాల వారి కయ్యాలు నిర్మించారు. స్టైల్ చిత్రాన్ని లారెన్స్ డైరక్ట్ చేసారు.