»   » కొత్త అప్ డేట్ : '1' (నేనొక్కడినే) ఆడియో రైట్స్

కొత్త అప్ డేట్ : '1' (నేనొక్కడినే) ఆడియో రైట్స్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : భారీ వ్యయంతో రూపొందుతున్న మహేష్‌బాబు '1' (నేనొక్కడినే) . ఈ చిత్రం ఆడియో చాలా విభిన్నంగా హైదరాబాద్ శిల్పకళా వేదికలో డిసెంబర్ 19న విడుదల కానుంది. ఈ చిత్రం ఆడియో రైట్స్ ని లహరి ఆడియో సంస్ధ భారీ మొత్తం చెల్లించి సొంతం చేసుకుంది. ఈ చిత్రంలో సరసన కృతిసనన్‌ నటిస్తోంది. సుకుమార్‌ దర్శకత్వం వహిస్తున్నారు. 14 రీల్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై రామ్‌ ఆచంట, గోపి ఆచంట, అనిల్‌ సుంకర నిర్మిస్తున్నారు. ఈ చిత్రం లెంగ్త్ బాగా తక్కువ ఉండబోతోందంటూ రకరకాల వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. అయితే ఈ చిత్రం ఫస్టాఫ్ 70 నిముషాలు, సెకండాఫ్ 60-65 నిముషాలు వరకూ ఉండబోతోందని విశ్వసనీయ సమాచారం.

అలాగే ఈ చిత్రం ఫస్ట్ హాఫ్ పక్కా కమర్షియల్ ప్యాకెడ్ గా సుకుమార్ డిజైన్ చేసారు. సెకండాఫ్ కొద్దిగా సెంటిమెంట్ తో కూడిన స్టైలిష్ యాక్షన్ థ్రిల్లర్ గా ఉండబోతోంది. అయితే కామెడీ సినిమాలో బాగా తక్కువగా ఉండబోతోందని వినికిడి. సబ్జెక్ట్ సీరియస్ గా ఉండటంతో స్పెషల్ గా కామెడీకి స్పేస్ తక్కువని చెప్తున్నారు. ఇక ఆడియో విడుదల అయ్యాక సినిమాకు మంచి క్రేజ్ వస్తుందని భావిస్తున్నారు. ముంబైలో తీద్దామనుకున్న బ్యాలెన్స్ పాటని,ఇక్కడే రామోజీ ఫీల్మ్ సిటిలో ఈ నెల 15 నుంచి తీయబోతున్నారు. జనవరి 10న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారు. డిసెంబరు ద్వితీయార్ధంలో పాటల్ని విడుదల చేయబోతున్నారు.

14 రీల్స్‌ ఎంటర్‌టైన్‌ మెంట్‌ పతాకంపై రామ్‌ ఆచంట, గోపీచంద్‌ ఆచంట, అనిల్‌ సుంకర నిర్మిస్తున్నారు. కృతి సనన్‌ హీరోయిన్. సుకుమార్‌ దర్శకుడు. గోవా షెడ్యూల్‌తో చిత్రీకరణ దాదాపుగా పూర్తయినట్టే. అక్కడే షూటింగ్ పూర్తికావటంతో గుమ్మిడికాయ కొడతారని సమాచారం. ఇక డిసెంబరులో నిర్మాణానంతర కార్యక్రమాలు ముగించుకొని సంక్రాంతి పండగ నాడు ఈ చిత్రాన్ని విడుదల చేయాలని నిర్మాతలు భావిస్తున్నారు. 'జనవరి 10న '1'ని తెచ్చేస్తున్నాం' అని మహేష్‌ కూడా చెప్పేశాడు. మహేష్‌కి సంక్రాంతి సీజన్‌ బాగా కలిసొచ్చింది 'ఒక్కడు', 'బిజినెస్‌మేన్‌', 'సీతమ్మ వాకిట్లో' ముగ్గుల పండక్కి విడుదలై విజయాన్ని సాధించాయి. ఇప్పుడు '1' కూడా పండగ బరిలో దిగబోతోంది.

అలాగే ఈ చిత్రంలో కృతిసనన్‌ ఓ టీవీలో న్యూస్‌ రీడర్‌గా పని చేస్తోంది. ఇందుకోసం ఆమె ఏవో వార్తలు చదువటాన్ని మొన్నా మధ్య రామోజీఫిల్మ్ సిటీలో వేసిన ప్రత్యేక సెట్ లో షూట్ చేసారు. యాక్షన్ థ్రిల్లర్ గా ఈ చిత్రం రూపొందుతోంది. మహేష్ బాబు తనయుడు గౌతమ్ కృష్ణ ఈ సినిమాతో తెరంగ్రేటం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో మహేష్ బాబు చిన్నప్పటి పాత్రను గౌతమ్ పోషిస్తున్నాడు. ఇక్కడ అందుకు సంబంధించిన సీన్లతో పాటు యాక్షన్ సీన్లు, చేజింగ్ సీన్లు చిత్రీకరించారు.

డిఫరెంట్ చిత్రాలకు పెట్టింది పేరైన దర్శకుడు సుకుమార్....చాలా కాలం పాటు స్క్రిప్టు వర్కు చేసి వైవిధ్యమైన అంశాలతో సినిమాను తెరకెక్కిస్తున్నారు. వినోదంతో పాటు అన్నిరకాల కమర్షియల్ ఎలిమెంట్స్‌తో ఈచిత్రం ప్రేక్షకులను అలరించనుంది. ఈ చిత్రంలో మహేష్ బాబు రాక్ స్టార్‌గా కనిపించనున్నాడని తెలుస్తోంది. మహేష్ సరసన కృతి షానన్ నటిస్తోంది. సాయాషి షిండే, కెల్లీ దోర్జి, విక్రం సింగ్, శ్రీనివాస రెడ్డి, నాజర్, ప్రదీప్ రావత్ ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్‌ ఈ చిత్రానికి సంగీతం అందించారు. ఛాయాగ్రహణం: రత్నవేలు, పోరాటాలు: పీటర్‌ హెయిన్స్‌, ఎగ్జిక్యూటివ్‌ నిర్మాత: పరుచూరి కోటి.

English summary
Mahesh Babu's 1 Nenokkadine will have audio launch in a different manner. Lahari Music, an audio company, bagged the audio rights. This is Devi Sri Prasad's first film for Mahesh Babu starrer.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu