»   » ‘బాహుబలి’ ఆడియో రైట్స్ ఎంతకు అమ్మారు?

‘బాహుబలి’ ఆడియో రైట్స్ ఎంతకు అమ్మారు?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: భారతీయ వెండితెరపై ఎస్‌.ఎస్‌.రాజమౌళి ఆవిష్కరించబోతున్న అత్యంత భారీ చిత్రం ‘బాహుబలి'. యంగ్‌రెబల్‌స్టార్‌ ప్రభాస్‌, రానా, అనుష్క, తమన్నా, రమ్యకృష్ణ, సుదీప్‌, సత్యరాజ్‌, నాజర్‌ వంటి భారీ తారాగణంతో అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న తొలి తెలుగు చిత్రంగా ‘బాహుబలి' ఇప్పటికే వార్తల్లోకి ఎక్కింది. ఈ చిత్రం ఆడియో రైట్స్ లహరి మ్యూజిక్ రూ. 2 కెట్లకు సొంతం చేసుకున్నట్లు సమాచారం.

Lahari Music bagged Baahubali audio rights

తెలుగు, తమిళ్‌, మలయాళం, హిందీ భాషల్లో రూపొందుతున్న ఈ చిత్రం కోసం సినిమా ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో, ఇండస్ట్రీలో వున్న ఎక్స్‌పెక్టేషన్స్‌ని మరింత పెంచేలా చిత్రంలోని క్యారెక్టర్లకు సంబంధించిన పోస్టర్స్‌ను రిలీజ్‌ చేస్తున్నారు దర్శకుడు రాజమౌళి.


కాగా, ఈ చిత్రంలోని పాటలు ఎలా వుండబోతున్నాయనే దానిపై సంగీత ప్రేమికులు ఒక అంచనాకు రాలేకపోతున్నారు. సినిమాని ఎంతో భారీగా, భారతీయ సినిమాలోనే అందరూ చెప్పుకునే రీతిలో తెరకెక్కిస్తున్న రాజమౌళి చిత్రంలోని పాటల విషయంలో కూడా ఎంతో శ్రద్ధ తీసుకుంటారన్న విషయం అందరికీ తెలిసిందే.


ఇప్పటివరకు వచ్చిన రాజమౌళి చిత్రాల్లోని పాటలను మించేలా సంగీత దర్శకుడు యం.యం.కీరవాణి ఒక ఛాలెంజ్‌గా ఈ చిత్రంలోని పాటలను రూపొందించారు. అలాగే చిత్రానికి ప్రాణంలాంటి బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ విషయంలో కూడా కీరవాణి ఎక్కడా రాజీపడకుండా తనదైన శైలిలో చేస్తున్నారు. ఇదిలా వుండగా ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్‌ను మే 31న విడుదల చేస్తున్నట్టు రాజమౌళి ఇదివరకే ప్రకటించారు.


ఈ చిత్రం ఆడియోను కూడా త్వరలోనే విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు ఆర్కా మీడియా అధినేతలు. ఈ సినిమాకి సంబంధించి తమిళ్‌, హిందీ భాషల్లో భారీ ఫ్యాన్సీ ఆఫర్‌తో బిజినెస్‌ జరిగింది. ఈ ఆడియోను ఏ కంపెనీ రిలీజ్‌ చేస్తుందనే విషయాన్ని ఇప్పటివరకు ప్రకటించలేదు దర్శకనిర్మాతలు. దక్షిణ భారతదేశంలో ఆడియో రంగంలో తమకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకొని ఎన్నో సూపర్‌ హిట్‌ చిత్రాల ఆడియోలను రిలీజ్‌ చేసి, వేల సంఖ్యలో ఆడియో ఆల్బమ్స్‌ కలిగి వున్న లహరి మ్యూజిక్‌ ఈ ప్రతిష్ఠాత్మక చిత్రం ‘బాహుబలి' ఆడియోను విడుదల చేస్తోంది. దక్షిణ భారత సినీ చరిత్రలో ఇప్పటివరకు ఏ ఆడియోకీ లభించని భారీ ఆఫర్‌ని ‘బాహుబలి' ఆడియోకు ఇచ్చి తెలుగు, తమిళ్‌ ఆడియో రైట్స్‌ తమ సొంతం చేసుకున్నారు లహరి మ్యూజిక్‌ అధినేత జి.మనోహర్ నాయుడు.


ఈ సందర్భంగా లహరి మ్యూజిక్‌ అధినేత జి.మనోహర్‌ నాయుడు మాట్లాడుతూ ‘‘ఈ ఏడాది తెలుగు ప్రేక్షకులందరూ ‘బాహుబలి', ‘రుద్రమదేవి' చిత్రాల కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. తెలుగు సినిమా చరిత్రలో శాశ్వతంగా నిలిచే వుండే ఈ రెండు చిత్రాలు మా ఆల్బమ్‌లో వుండాలని తొలుత ‘రుద్రమదేవి' ఆడియో రైట్స్‌ కొన్నాము. వైజాగ్‌, వరంగల్‌లలో ఈ చిత్రం ఆడియో రిలీజ్‌ ఫంక్షన్స్‌ ఎంతో ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. ఇప్పుడు భారత సినీ పరిశ్రమలో లేటెస్ట్‌ సేన్షేషన్‌ ‘బాహుబలి'. ఈ చిత్రం ఆడియోకు ఎంతో పోటీ వున్నప్పటికీ మంచి ఫాన్సీ ఆఫర్‌ ఇచ్చి ఈ ఆడియో రైట్స్‌ సొంతం చేసుకున్నాం. ‘బాహుబలి' ఆడియో కూడా మా సంస్థ ద్వారా త్వరలో విడుదల చేస్తున్నామని తెలియచేస్తున్నందుకు ఎంతో సంతోషంగా వుంది. తెలుగు, తమిళ్‌ ఆడియో రైట్స్‌ మాకే ఇచ్చి మమ్మల్ని ప్రోత్చాహించిన రాజమౌళిగారికి, కీరవాణిగారికి, శ్రీవల్లిగారికి, నిర్మాతలు కె. రాఘవేంద్రరావుగారికి, శోబు యార్లగడ్డగారికి, ప్రసాద్‌ దేవినేనిగారికి ధన్యవాదాలు. ఇలాంటి ప్రతిష్ఠాత్మక చిత్రాల ఆడియోలు మేం కలిగి వుండడం మాకు, మా సంస్థకు గర్వకారణంగా భావిస్తున్నాం'' అన్నారు

English summary
The Lahari Music has bagged the audio rights of the forthcoming epic movie “Baahubali” under the direction of SS Rajamouli. Lahari Music has purchased the audio rights of the movie for a fancy price of Rs.2 crores.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu