twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అలాంటి వాళ్లకు బూతులా కనిపిస్తుంది (లజ్జ మూవీ టీజర్)

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: శివ, వరుణ్, మధుమిత ప్రధాన పాత్రల్లో, శ్రీ లక్ష్మీ నరసింహ సినిమా బ్యానర్‌పై నరసింహ నంది దర్శకత్వంలో, బూచేపల్లి తిరుపతి రెడ్డి నిర్మాతగా నిర్మించిన లజ్జ. ప్రతి అమ్మాయి పెళ్ళైన తరువాత తన భర్త ప్రేమ తనకే సొంతం అని కలలు కంటుంది. భర్త దగ్గర నుండి ప్రేమను పొందక పోయినప్పుడు ఆ అమ్మాయి ఆలోచనలు ఎలాంటి పరిస్థితికి దారి తీస్తాయి అన్నదే చిత్ర కథ.

    సోమవారం ప్రసాద్‌ ప్రివ్యూ థియేటర్‌లో జరిగిన కార్యక్రమంలో ఈ సినిమా టీజర్లను మాజీ మంత్రి దామోదర్‌రెడ్డి, సీనియర్‌ డైరెక్టర్‌ బి.గోపాల్‌, సీనియర్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌ ఆర్పీ పట్నాయక్‌ ఆవిష్కరించారు. సున్నిత కథాంశాలతో సినిమాలు తీస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నరసింహ రూపొందించిన ఈ చిత్రాన్ని ఎప్పుడెప్పుడు చూద్దామా అనే ఆసక్తితో ఉన్నామని వారన్నారు.

    నరసింహ నంది మాట్లాడుతూ ‘‘కళాత్మక సినిమా తరహా కథను వాణిజ్య పంథాలో రూపొందించాను. బాలూ మహేంద్ర, బాలచందర్‌ శైలితో పాటు నా గురువు బి. గోపాల్‌ శైలిని కూడా జోడించి ఈ చిత్రాన్ని తీశాను. నా సంభాషణలకు రచయిత చలం ప్రేరణ. చిత్రంలోని సుశీల పాత్రను మధుమిత సహజంగా పోషించింది. వరుణ్‌, శివకు మంచి పేరు వస్తుంది. ఆలోచనాపరులకు నా సినిమా అద్భుత దృశ్య కావ్యంగా కనిపిస్తే, ఆలోచించనివాళ్లకు బూతు సినిమాలా కనిపిస్తుంది. ఇది ఇద్దరు ముస్లిం యువకులు, ఓ హిందూ యువతి మధ్య నడిచే కథ'' అని చెప్పారు.

    దర్శకుడు సినిమాని అద్భుతంగా తీశారనీ, తప్పకుండా బాగా ఆడుతుందనే నమ్మకం ఉందనీ నిర్మాత తిరుపతిరెడ్డి, సహ నిర్మాతలు పి.ఎల్‌.కె. రెడ్డి, పాశం వెంకటేశ్వర్లు, కె. రవిబాబు తెలిపారు. తనకు షబానా అజ్మీ, టాబు, నందితాదాస్‌ స్ఫూర్తి అనీ, అందుకే ఈ సినిమాలో దర్శకుడు చెప్పినట్లు బోల్డ్‌గా నటించాననీ మధుమిత అన్నారు. ఈ కార్యక్రమంలో గేయ రచయిత వనమాలి, సంగీత దర్శకుడు సుక్కు, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్స్‌ బుజ్జి, రఫీ, ఆలేటి శ్రీనివాసరావు, కృష్ణ, బ్రహ్మవలి, ఛాయాగ్రాహకుడు యస్‌. మురళీమోహనరెడ్డి, నటులు వరుణ్‌, శివ, మహంతి, ఫణి, స్ర్కీన్‌ప్లే రచయిత అనిల్‌కుమార్‌, ఇతర యూనిట్‌ సభ్యులు పాల్గొన్నారు.

    English summary
    Watch Lajja movie teaser. Starring Madhumitha, Shiva, Varun, Pavani and Mahanthi among others. Directed by Narasimha Nandi and produced by Buchepalli Tirupathi Reddy. Music composed by Sukku.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X