twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ప్రతీ ఫెయిల్యూర్‌కు లక్ష... కారణమైన త్రివిక్రమ్‌కు హ్యాట్సాఫ్‌.. లక్ష్మీభూపాల

    |

    'చందమామ', 'అలా మొదలైంది', 'మహాత్మ', 'టెర్రర్‌', 'నేనే రాజు నేనే మంత్రి', 'కల్యాణ వైభోగమే' చిత్రాలతో మాటల రచయితగా మంచి పేరు తెచ్చుకున్నారు లక్ష్మీ భూపాల్‌. ఇటీవల విడుదలైన 'ఓ బేబీ'తో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. అలాగే, లక్ష్మీ భూపాల్‌ తెలుగు చిత్ర పరిశ్రమలో రచయితగా ప్రవేశించి పదిహేనేళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా మీడియాతో ముచ్చటించారు.

    ఓ బేబీ గురించి ప్రత్యేకంగా మాట్లాడుతున్నారు

    ఓ బేబీ గురించి ప్రత్యేకంగా మాట్లాడుతున్నారు

    'ఓ బేబీ' విడుదల తర్వాత ప్రేక్షకులు, విమర్శకులు సమంత నటన, నందినీరెడ్డి దర్శకత్వంతో పాటు నేను రాసిన మాటల గురించి ప్రత్యేకంగా మాట్లాడుతున్నారు. 'సిరివెన్నెల' సీతారామశాస్త్రిగారు ఫోన్ చేసి అరగంటకు పైగా మాట్లాడారు. కెఎస్ రామారావు గారు ఫోన్ చేశారు. ఇండస్ట్రీ నుంచి, ప్రేక్షకుల నుంచి ఎన్నో ఫోనులు వచ్చాయి. అందరికీ కృతజ్ఞత తెలపడానికి వచ్చాను. అందుకే ఎన్నడూ మీడియా ముందుకు రాని నేను ఈ రోజు నా ఆనందాన్ని పంచుకోవడానికి వచ్చాను అని లక్ష్మీభూపాల అన్నారు.

    చిన్నతనంలో నాన్న మరణంతో

    చిన్నతనంలో నాన్న మరణంతో

    చిన్నతనంలో నాన్న పోవడంతో నాకు అమ్మ, అమ్మమ్మతోనే నా అనుబంధం. ఈ సినిమా చూసేటప్పుడు అమ్మ పక్కనే కూర్చున్నాను. కొన్ని సన్నివేశాలు వచ్చేటప్పుడు నావైపు చూసేది. ఉదాహరణకు... చేపల పులుసు వాసన చూసి ఉప్పు సరిపోలేదని నేను చెప్పేస్తా. లక్ష్మిగారి పాత్రకు దాన్ని అన్వయిస్తూ సన్నివేశం రాశా. ఇటువంటివి కొన్ని ఉన్నాయి. అమ్మకు సినిమా బాగా నచ్చింది.

    ఆ డైలాగ్ ఎవరి గురించి అంటే

    ఆ డైలాగ్ ఎవరి గురించి అంటే

    'మొలతాడుకి, మోకాలి మధ్య కొవ్వు పెరిగిపోయి కొట్టుకుంటున్నారు' డైలాగ్ గురించేనా? సినిమాలో నాగశౌర్య పాత్రను ఉద్దేశించి సమంత గారు ఆ డైలాగ్ చెప్పారని అనుకుంటున్నారు. సరిగా వింటే అందరినీ ఉద్దేశించి రాసిన డైలాగ్ అని తెలుస్తుంది. ప్రతివారం ఎక్కడో చోట చూస్తున్నాం లేదా వింటున్నాం. తొమ్మిదేళ్ల పాపపై అని, మరొకటి అని. అందుకే, ఆ మాట రాశా. సెన్సార్ వాళ్లకు భయపడి నేను చెప్పాలనుకున్న భావాన్ని పూర్తిగా కాకుండా, కొంచెం సుతిమెత్తగా రాశా. లేదంటే ఇంకా ఘాటుగా రాసేవాణ్ణి.

    వారితోనే ఎక్కువ సినిమాల చేశా

    వారితోనే ఎక్కువ సినిమాల చేశా

    కృష్ణవంశీ, నందినిరెడ్డి, సతీష్ కాసెట్టి ఎక్కువ సినిమాలు చేశాను. ఒక్కొక్కరితో మూడేసి సినిమాలు చేశా. ఇంకా చాలామందితో చేశా. తేజగారితో చేసిన 'నేనే రాజు నేనే మంత్రి' మంచి పేరు తెచ్చింది. ఇక పెద్ద హీరోలతో కొన్ని అవకాశాలు వచ్చాయి. కానీ, కుదరలేదు. రవితేజ 'బలాదూర్'కి చేశాను కదా! బహుశా... నేను పంచ్ డైలాగులు, ప్రాసలకు దూరంగా ఉంటాను కనుక అవకాశాలు రాలేదేమో.

    బడా హీరోల స్టామినా పెంచే సినిమాలకు

    బడా హీరోల స్టామినా పెంచే సినిమాలకు

    స్టార్ హీరోలు, దర్శకులు అవకాశాలు ఇవ్వలేదేమో. నాకు ప్రభాస్, మహేష్ బాబు, ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్ చరణ్ సినిమాలు చేయాలని ఉంటుంది. అవకాశం వస్తే... వాళ్ల బాలాలు చూపించేలా డైలాగులు రాయాలని ఉంటుంది. చిరంజీవిగారు 'దొంగ మొగుడు' లాంటి సినిమా చేస్తే ఎంత హుషారుగా ఉంటుందో ఆలోచించండి. అవకాశాల కోసం చూస్తున్నాను. స్టార్ హీరోలతో పనిచేయలేదేమో గానీ... స్టార్ ప్రొడక్షన్ హౌసులు సురేష్ ప్రొడక్షన్స్, వైజయంతి మూవీస్, ఉషాకిరణ్ మూవీస్ కి పని చేశా. నా ఫస్ట్ మూవీ 'సోగ్గాడు' సురేష్ ప్రొడక్షన్స్ సినిమా.

     రైటర్‌గా హిట్లు, ఫట్లు

    రైటర్‌గా హిట్లు, ఫట్లు

    నేను రైటర్‌గా వర్క్ చేసిన సినిమాలు ఫెయిల్ అయ్యాయి. కానీ, రైటర్ గా నేను ఎప్పుడు ఫెయిల్ కాలేదు. ఫెయిల్ అయితే తర్వాత మరో అవకాశం వచ్చేది కాదు కదా. ఫెయిల్యూర్ వచ్చిన ప్రతిసారి నేను లక్ష రూపాయల రెమ్యునరేషన్ పెంచేవాణ్ణి. కసితో రాసేవాణ్ణి. బావుంది. హ్యాట్సాఫ్ టు త్రివిక్రమ్ గారు. ఆయన ఒక ప్యారామీటర్ సెట్ చేశారు. రైటర్ ఇంత తీసుకోవచ్చు, రైటర్ కి ఇంత ఇవ్వొచ్చు అని చూపించారు.

    English summary
    After seven languages, Oh! Baby is set to remake in another langugae. Now this movie is running successfully at tollywood box office. In this occassion, Writer Lakshmi Bhupala speaks to media.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X