»   » టైం చూసి మంచు లక్ష్మి 'బాంబు' పేలుస్తోంది

టైం చూసి మంచు లక్ష్మి 'బాంబు' పేలుస్తోంది

Posted By:
Subscribe to Filmibeat Telugu

మంచు లక్ష్మీప్రసన్న టైటిల్‌ పాత్రలో కార్తికేయ గోపాలకృష్ణ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం 'లక్ష్మీబాంబ్‌'. ఈ చిత్రాన్ని డిసెంబరు 23న విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది.

ఈ సందర్భంగా మంచు లక్ష్మి మాట్లాడుతూ.. 'జడ్జి పాత్రలో తొలిసారి నటించాను. దర్శకుడు కార్తికేయ గోపాలకృష్ణ సింగిల్‌ షెడ్యూల్‌లోనే చక్కగా సినిమాను పూర్తి చేశారు. పాటలకు మంచి స్పందన వస్తోంది. సినిమాను డిసెంబరు 23న విడుదల చేయడానికి నిర్మాతలు ప్రయత్నిస్తున్నారు' అన్నారు.

ఉద్భవ్‌ ప్రొడక్షన్స్‌ పతాకంపై వేళ్ల మౌనిక చంద్రశేఖర్‌, ఉమా లక్ష్మీనరసింహ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సునీల్‌ కశ్యప్‌ స్వరాలు సమకూర్చారు. పోసాని కృష్ణమురళి, హేమ, ప్రభాకర్‌, భారత్‌రెడ్డి, జీవా, అమిత్‌ తదితరులు ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషించారు.

English summary
Manchu clad is coming to entertain all with 'Lakshmi Bomb'. In this film, Lakshmi is portraying a powerful judge role. Now the news is, 'Lakshmi Bomb' is going to be uncovered in theatres on December 23. Being directed by Karthikeya Gopalakrishna, the entire shoot of the film has been wrapped up in a single schedule.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu