పవన్ కళ్యాణ్ కొరకు మానవ హక్కుల కమీషన్ తో గొడవకు దిగిన యువతి!
నేడు సమాజం మంచి పై పట్టు కోల్పోతుందని ఎంతో కొంత మార్పు తీసుకురావాలని ఎంతో తాపత్రయపడే పవన్ కళ్యాణ్..అది సాధ్యం కాదని సైలెంట్ గా సినిమాలవైపు దృష్టిని మరల్చడంతో టాలీవుడ్ పరిశ్రమలో చిరంజీవి రాజకీయరంగం వైపు వెళ్లిన తర్వాత నెంబర్ వన్ పై నెలకొన్న అనుమానాలకు ఫుల్ స్టాప్ పెట్టాలనే దిశగా ఆలోచన చేస్తున్నాడట. అదే పనిగా పవన్ సినిమాలవైపు దృష్టి పెట్టాడో లేదో వరుసగా దర్శకనిర్మాతలు కథలు తీసుకువచ్చి పవన్ కు వినిపిస్తున్నారట.
సినిమాలను నమ్ముకుని ఎంతోమంది ఈ గ్లామర్ ప్రపంచంలోకి అడుగుపెడుతుంటారు. కానీ కొంతమందినే అదృష్టం వరిస్తుంది. మరికొంతమంది అవకాశాల కోసం ఎదురుచూస్తుంటారు. అలాంటి వాళ్ళలో లక్ష్మీ లావణ్య అనే యువతి ఉంది. తన దగ్గర మంచి కథలు ఉన్నాయనీ, పవణ్‌కళ్యాణ్ లాంటి హీరోకు, ప్రముఖ దర్శకులకు ఆ కథ వినిపించినా ఎవరూ సరిగ్గా స్పందించలేదని ఈ యువతి మానవ హక్కుల కమీషన్‌లో పిటీషన్ దాఖలు చేసింది. కానీ ఈ కేసు తమ పరిధిలోకి రాదని పిటీషన్‌ని తిరస్కరించారు. దాంతో ఆమరణ దీక్షకు పూనుకున్న లక్ష్మీ లావణ్యను పోలీసులు బుజ్జగించి పంపివేసారు.


Click it and Unblock the Notifications











