‘గుండెల్లో గోదారి’ ఆడియో 17న

ఈ చిత్రం రీ రికార్డింగ్ పనులు ఇటీవల చెన్నయ్ లో జరుగుతుండగా అక్కడికి వచ్చిన తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ సినిమా టీంకు అభినందనలు తెలియజేశారు. తమ సినిమాకు అంతటి పెద్ద స్టార్ అభినందనలు తెలియజేయడం ఆనందంగా ఉందని, మంచి కథను ఎంచుకున్నారని రజనీ అంకుల్ మెచ్చుకున్నారని వివరించారు.
ఈ చిత్రం తమిళంలో కూడా విడుదల కానుంది. 1986లో వచ్చిన వదరలు, ప్రేమకథను మిళితం చేసిన కథతో ఈ సినిమా రూపొందుతోంది. చిత్రంలో ప్రతి ఒక్కరు కొత్తగా కనిపించనున్నారు. ముమైత్ ఖాన్ ఐటం సాంగు చేస్తోంది. ఈ చిత్రం తమిళంలో కూడా విడుదల కానుంది. చిత్రంలో ప్రతి ఒక్కరు కొత్తగా కనిపించనున్నారు.
కథా వస్తువు మత్స్యకారుల జీవితాలకి సంబంధించినది కావడం వల్ల, పశ్చిమ గోదావరి జిల్లా తీర ప్రాంతంలోని 27 ఎకరాలలో 120 గుడిసెలతో కూడిన పల్లె సెట్ ను వేశారు. చిత్రం చాలా వరకు పాలకొల్లు,అమలాపురం మరియు గోదారి జిల్లాల పరిసరాలలో తెరకెక్కించారు. ఇళయరాజా సంగీతం అందించారు. ఈ చిత్రానికి సమర్పణ:మోహన్‌బాబు.ఎం. నిర్మాత:మంచు లక్ష్మీ ప్రసన్న, దర్శకత్వం:కుమార్ నాగేంద్ర.


Click it and Unblock the Notifications











