బ్రేక్ వస్తుందంటోన్న లక్ష్మీ ప్రసన్న
మంచు లక్ష్మీ ప్రసన్న ఇప్పుడు చాలా హ్యాపీగా ఉంది. రామ్ గోపాల్ వర్మ దర్సకత్వంలో ఆమె హిందీలో డిపార్టమెంట్ చిత్రంలో చేస్తోంది. ఈ విషయమై ఆమె మాట్లాడుతూ.. రాముతో పనిచేయటం చాలా వండ్రఫుల్ ఎక్సపీరియన్స్. సినిమా చాలా గొప్పగా వస్తోంది. అందులోనూ రానా ఉండటంతో చాలా ఫన్ గా షూటింగ్ గడిచిపోతోంది.ఇక ఈ చిత్రంలో సంజయ్ దత్ సరసన నటిస్తున్నాను. అతని సినిమాలు చూస్తూ పెరిగిన దాన్ని కావటంతో అతనితో సినిమా చేయటం చాలా ధ్రిల్లింగ్ గా ఉంది. ఇక నా రోల్ ఈ చిత్రంలో నా నిజ జీవితానికి దగ్గరగా ఉండేది. నా ఇతర సినిమాల్లోలాగ ఇందులో సంప్రదాయబద్దంగా కనపడను. చాలా ఫంకీగా ఉంటాను. అలాగే ఈ చిత్రం నాకు బాలీవుడ్ లో బ్రేక్ ఇస్తుందని భావిస్తున్నాను.అలాగే చాలామంది నటీమణులు వయస్సు కేవలం పద్దేనిమిది నుంచి ఇరవై ఐదు మధ్య ఉంటేనే రాణిస్తామనుకుంటారు.. అది తప్పు అంది.


Click it and Unblock the Notifications











