యాక్సిడెంట్ అయినప్పుడు వాళ్ళే..మంచు లక్ష్మి
వాళ్ళిద్దరే నాకు బెస్ట్ ప్రెండ్స్.ఈ మధ్యన నాకు యాక్సిడెంట్ అయినప్పుడు వాళ్ళ పేరెంట్స్ నన్ను వాళ్ళ సొంత బిడ్డలా జాగ్రత్తగా చూసుకున్నారు అంటో్ది మంచు లక్ష్మీ ప్రసన్న.ప్రెండ్ షిప్ డే సందర్భంగా ఆమె ఈ విషయాలను చెప్పుకొచ్చింది.ఇంతకీ ఎవరా ప్రెండ్స్ అంటే..రేవతి,యామిని అని చెప్పుకొచ్చింది.వాళ్ళద్దరీ ఆమెకు కాలేజ్ రోజుల నుంచి బాగా క్లోజ్ అని,ఆ స్నేహం ఇప్పటికీ కొనసాగుతోందని అంది.తనుకు ఎంత క్రేజీ బిజీ షెడ్యూల్ ఉన్నా వాళ్ళ కోసం టైమ్ కేటాయిస్తానని చెప్పుకొచ్చింది.అలాగే వాళ్లు తనకోసం వండిపెడతారని,షాపింగ్ చేస్తారని అంది.ఇక ప్రస్తుతం లక్ష్మి ప్రసన్న తన సోదరుడు మంచు మనోజ్ హీరోగా ఊ కొడతారా..ఉలిక్కి పడతారా చిత్రం నిర్మిస్తోంది.అలాగే ఆమె ప్రధాన పాత్రలో గుండెల్లో గోదావరి అనే చిత్రం ప్లాన్ చేస్తోంది.వీటితో పాటు నటిగా ఆమె రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో డిపార్టమెంట్ అనే హిందీ చిత్రంలో చేస్తోంది.


Click it and Unblock the Notifications











