twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పెళ్లి పీటల నుంచి పారిపోదామనుకొన్నా.. లక్ష్మీ మంచు, పెళ్లి తర్వాత ఏం చేయాలంటే.. రానాకు క్రేజీ టిప్స్

    |

    టాలీవుడ్ హల్క్ రానా దగ్గుబాటి త్వరలోనే ఇంటి వాడు కాబోతున్నాడు. హైదరాబాద్‌కు చెందిన ఉత్తరాది అమ్మాయి మిహికా బజాజ్‌ను పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకొన్నారు. ఈ క్రమంలో ఇటీవల ఇరు ఫ్యామిలీ మధ్య రోకా ఫంక్షన్ జరిగింది. ఈ క్రమంలో మిహికాతో రిలేషన్ అనౌన్స్ చేసిన తర్వాత తొలి ఇంటర్వ్యూను లక్ష్మి మంచుకు ఇచ్చారు. వారిద్దరి మధ్య ఇన్స్‌టాలో జరిగిన ఆసక్తికరమైన సంభాషణ ఇదే..

    Recommended Video

    Lakshmi Manchu, Rana Daggubati Funny Talk On Rana's Wedding
    నా పెళ్లి జరిగేటప్పుడు

    నా పెళ్లి జరిగేటప్పుడు

    నా పెళ్లి జరిగేటప్పుడ నాకు అంతా గందరగోళంగా అనిపించింది. అండితో పెళ్లికి ముందు నాకు ఏడేళ్ల పరిచయం ఉంది. పెళ్లి జరిగే ముందు గౌరీపూజ చేసే సమయంలో చాలా నెర్వెస్‌గా ఫీలయ్యాను. నాకు బాగా తెలిసిన వ్యక్తితో పెళ్లి జరుగుతుందని తెలిసినా ఏదో తెలియని భయం. చేతిలో కొబ్బరికాయ పెట్టుకొని పూజకు వెళ్తూ నేను పారిపోదామనుకొన్నాను. అలాంటి ఫీలింగ్ నీకు కలిగిందా? అని మంచు లక్ష్మి అడిగారు.

     నాకు అలాంటి ఫీలింగ్ కలుగలేదు

    నాకు అలాంటి ఫీలింగ్ కలుగలేదు

    అయితే మంచి లక్ష్మి ప్రశ్నకు సమాధానమిస్తూ.. పెళ్లి చేసుకోవాలనుకొని నిర్ణయం తీసుకొన్నప్పుడు నాకు అలాంటి ఫీలింగ్ కలుగలేదు. ఎందుకంటే చిన్నతనంలో పెళ్లి జరిగితే నిజంగా అలాంటి ఫీలింగ్ కలిగేదేమో. కానీ మనం చాలా మెచ్యుర్డ్ స్టేజ్‌లోకి వెళ్లాం. చాలా ప్రపంచాన్ని చూశాం. అన్ని విషయాలు తెలుసుకొన్నందున తర్వాత ఇలాంటి ఫీలింగ్ రాలేదేమో అని రానా అన్నారు.

     మిహికా తెలుగు అమ్మాయే..

    మిహికా తెలుగు అమ్మాయే..

    రానాతో మాట్లాడుతూ.. తెలుగు అమ్మాయిలు దొరకలేదా.. ఉత్తరాది అమ్మాయిని పెళ్లి చేసుకొంటున్నావు. నీవు పెళ్లి చేసుకొంటున్నావని తెలిసి ఎంత మంది తెలుగు అమ్మాయిల గుండెలు పలిగాయో తెలుసా? నాకు తెలిసిన చాలా మంది అమ్మాయిలు భోజనం కూడా మానేశారు అంటూ లక్ష్మి మంచు తెలిపారు. అయితే మిహికా కూడా హైదరాబాదీ అమ్మాయే.. ఆమెకు తెలుగు మాట్లాడటం వచ్చు అంటూ రానా సమాధానం ఇచ్చారు.

    త్వరగా పిల్లల్ని కనాలి..

    త్వరగా పిల్లల్ని కనాలి..

    రానా నీవు పెళ్లి చేసుకోంటున్నావు కాబట్టి నీకు ఓ సలహా ఇస్తాను. పెళ్లి కాగానే వెంటనే పిల్లల్ని కనాలి. మనకంటూ పిల్లలు ఉంటే చాలా చాలా అద్భుతంగా ఉంటుంది. త్వరలోనే నేను బుల్లి రానా చుట్టూ పరిగెత్తే రానాను నేను చూడాలి. పిల్లలు ఆ ప్రపంచమే వేరుగా ఉంటుంది. కాబట్టి పెళ్లి తర్వాత ఆలస్యం చేయకుండా వెంటనే పిలల్ని కనే విషయాన్ని ఆలోచించు అని లక్ష్మి మంచు సలహా ఇచ్చారు.

    English summary
    Rana Dagguabati reveals about affair with Miheeka Bajaj. He joined in Lakshmi Manchu Instagram Live show and reveals about his love and Roka functions. After Roka, Rana Speaks exclusively with Lakshmi Manchu on Insta.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X