USకి చెందిన యూనివర్శిటీ.. లక్ష్మి మంచుకి సత్కారం
హైదరాబాద్: నటి, నిర్మాత మంచు లక్ష్మి ప్రసన్నని ఓక్లహోమా సిటీ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ థియోటర్ వారు సత్కరించబోతున్నారు. ప్రతీ సంవత్సరం ఆ యూనివర్సిటీ వారు అక్కడే చదవి, కళా రంగంలో రాణిస్తున్న వారిని ఐదుగురుని ఎంపిక చేసి సత్కరిస్తూంటుంది. ఆ ఐదుగురులో మంచు లక్ష్మి కూడా ఉంది.
ఇక ఈ సత్కార కార్యక్రమం శుక్రవారం జరగనుంది. ఓక్లహోమో సిటీ యూనివర్సిటీలో తన గ్రాడ్యువేషన్ ని లక్ష్మి మంచు పూర్తి చేసింది. ప్రస్తుతం ఆమె యూనివర్శిటీ ఆఫ్ సౌతెర్న్ కాలిఫోర్నియా వలో ఫిల్మ్ ప్రొడక్షన్ కోర్స్ చేస్తోంది. మన దేశం నటుల నుంచి సత్కారం ఆ యూనివర్శిటీ నుంచి పొందే అవకాసం మంచు లక్ష్మికే కలిగింది.
ఇక రీసెంట్ గా మంచు లక్ష్మి... గుండెల్లో గోదారి చిత్రం నిర్మించి నటించింది. ఆ చిత్రం భాక్సాఫీస్ వద్ద బాగానే వసూలు చేసింది. ఆమె నటనకు మంచి ప్రసంసలు కూడా వచ్చాయి. ఈ నేపధ్యంలో ఆమె మరో రెండు చిత్రాలకు శ్రీకారం చుట్టబోతున్నట్లు వినికిండి. ఇక సత్కారం అందుకుంటున్న సందర్భంగా మంచు లక్ష్మికి ధట్స్ తెలుగు శుభాకాంక్షలు అందచేస్తోంది.


Click it and Unblock the Notifications











