తాప్సీ పాలిట మంచు లక్ష్మి గాడ్ మదర్
మోహన్ బాబు కూతురు మంచు లక్ష్మి గాడ్ మదర్ కాబోతోంది. సాధారణంగా సినిమా ఇండ్రస్ట్రీలో ఒకరి అండతో పైకి వస్తే వారిని గాడ్ ఫాదర్ అంటుంటారు. పురుషులకైతే ఈ పదాన్ని వాడవచ్చు. కానీ మహిళలకైతే..? గాడ్ మదర్ అనడం కరెక్టేమో. మంచు లక్ష్మి కూడా ఇలా గాడ్ మదర్ అనిపించుకోబోతోంది.
'ఝుమ్మందినాదం" సినిమా ద్వారా సినిమా అరంగ్రేటం చేసిన హీరోయిన్ తాప్సీ. ఇందులో మంచు మనోజ్ తో నటించిన తాప్సీ, ఆ తర్వాత మనోజ్ అన్నయ్య విష్ణుతోనూ ఓ సినిమాలో హీరోయిన్ గా నటించింది. అలా అలా మోహన్ బాబు ఫ్యామిలీకి చాలా దగ్గరై సినిమా రంగంలో తన స్థానం పదిలం చేసుకోవడంతో పాటు, ప్రస్తుతం వరుస అవకాశాలతో టాప్ హీరోయిన్ స్థానం కోసం పోటీ పడుతోంది. ప్రస్తుతం తాప్సీ టాప్ డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వంలో 'మొగుడు" సినిమాలో గోపీ చంద్ సరసన లీడ్ రోల్ చేస్తోంది.
ఇలా తాప్సీ ఈ స్థాయికి ఎదగడానికి కారణం మంచు లక్ష్మి. ఎందుకంటే తాప్సీని సీని పరిశ్రమకు పరిచయం చేయడం నుంచి, తాజాగా మొగుడు సినిమాలో అవకాశం దక్కడానికి కూడా....మంచు లక్ష్మి పాత్ర ఉందట. అందుకే తాప్సీకి గాడ్ మదర్ మంచు లక్ష్మి అని అంటున్నారంతా. తాప్సీ కూడా త్వరలో ఇదే విషయాన్ని ప్రకటించనున్నట్లు సమాచారం.


Click it and Unblock the Notifications