Don't Miss!
- News కాలేజ్ క్యాంపస్ లో పోలిటికల్ లీడర్ కూతురి హత్య, కన్న కూతుర్ని ఎవరు ఎలా చంపారో చెప్పిన లీడర్ !
- Finance Amazon News: అమెజాన్ సీక్రెట్ స్టోర్.. ప్రాజెక్ట్ క్యూరియాసిటీ వివరాలివే..
- Automobiles కారు ప్రియులకు గుడ్‌న్యూస్.. భారతీయ మార్కెట్లోకి సరికొత్త కారుతో వస్తోన్న 'ఫోర్డ్'!!
- Lifestyle భార్యా భర్త గొడవపడినా..బంధం బలంగా ముందుకు కొనసాగాలంటే ఇవి పాటించాలి..
- Technology Samsung నుంచి 'Music Frame' స్పీకర్ లు లాంచ్! ప్రత్యేకతలేంటి. ధర వివరాలు
- Sports భారత్.. టీ20 వరల్డ్ కప్ 2024 కొట్టాలంటే: లెజెండరీ ప్లేయర్ సలహా
- Travel ట్రైన్ జర్నీలో ఆరు రోజులపాటు సాగే తిరుపతి టు ఊటీ టూర్ ప్యాకేజీ..వివరాలివే..!
బోల్డ్‌గా నటించా, నాన్న ఏమంటారో : మంచు లక్ష్మి
హైదరాబాద్: 'ఎల్బీడబ్ల్యూ' చిత్రంతో దర్శకుడిగా పరిచయమై 'రొటీన్ లవ్‌స్టోరీ' చిత్రంతో కమర్షియల్ సక్సెస్‌ను అందుకున్న ప్రవీణ్ సత్తారు తాజాగా తెరకెక్కిస్తున్న మూడవ చిత్రం 'చందమామ కథలు'. ఎ వర్కింగ్ డ్రీమ్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై చాణక్య బూనేటి నిర్మిస్తున్నారు. మంచు లక్ష్మిప్రసన్న, చైతన్య కృష్ణ, సీనియర్ నటుడు నరేష్, ఆమని, కృష్ణుడు, కిశోర్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.
'చందమామ కథలు' చిత్రం ఈ నెల 25న విడుదల అవుతున్న నేపథ్యంలో సినిమా వివరాలను వెల్లడిస్తూ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చారు ఆ చిత్రంలో నటించిన మంచు లక్ష్మి ప్రసన్న. సినిమా విభిన్నంగా ఉంటుందని, తాను సరికొత్త పాత్ర పోషించినట్లు ఆమె తెలిపారు.
మంచు లక్ష్మి చెప్పిన విషయాలు స్లైడ్ షోలో....
చాలెజింగ్ పాత్ర
నేను ఈ సినిమాలో లిసా స్మిత్ అనే సూపర్ మోడల్ పాత్ర చేసాను. జీవిత ప్రయాణంలో అనేక సార్లు కిందపడి, పైకి లేవడం జరుగుతుంది. కింద పడిన ప్రతి సారి ఎలా ఫైట్ చేసి పైకి వచ్చిందనేదే నా పాత్ర కథ అని మంచు లక్ష్మి తెలిపారు.
స్మోకింగ్, డ్రింకింగుపై
స్మోకింగ్, డ్రింకింగ్ లాంటివి తెరపై చూపించడం నాకు ఇష్టం లేదు. కానీ నా పాత్ర డిమాండ్ చేయడంతో ఒక ప్రొఫెషనల్ యాక్టర్‌గా అలాంటి సన్నివేశాల్లో నటించాను అన్నారు మంచు లక్ష్మి.
బోల్డ్ రోల్, నాన్న ఎలా స్పందిస్తారో...
త్వరలోనే నాన్నగారికి ఈ సినిమా చూపించాలని అనుకుంటున్నాను. ఈ సినిమాలో నేను పోషించిన బోల్డ్ రోల్ చూసి ఆయన ఏమంటారు? ఎలా రియాక్ట్ అవుతారా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. అని మంచు లక్ష్మి చెప్పుకొచ్చారు.
చందమామ కథలు
చందమామ కథలు చిత్రంలో నేను చేసిన పాత్ర మంచి పేరు తెస్తుందని భావిస్తున్నాను. ఈ పాత్ర చేయడం ద్వారా నటిగా ఓ మెట్టు ఎక్కాను అనితెలిపారు.