ఈ రోజు మంచు లక్ష్మి కూతురు బర్త్ డే (ఫోటోలు)
హైదరాబాద్: మంచు లక్ష్మి తల్లయింది ఇటీవలే కాదా....అప్పుడే బర్త్ డే ఏంటి అనుకుంటున్నారా? సాధారణంగా అంతా సంవత్సరానికి ఒకసారి బర్త్ డే జరుపుతారు. కానీ మంచు లక్ష్మి మాత్రం ప్రతి నెలా తన కూతురికి బర్త్ డే జరిపేట్లు ఉంది. నేటితో మంచు లక్ష్మి కూతురు జన్మించి నెల పూర్తయింది.
ఈ సందర్భంగా నెల వయసున్న తన కూతురు ఫోటోను సోషల్ నెట్వర్కింగులో పోస్టు చేసి...'హ్యాపీ ఫస్ట్ మంత్ బర్త్ డే తల్లి' అంటూ ఓ పోస్టు చేసింది. అదన్నమాట సంగతి. మంచు లక్ష్మి కూతురు పేరు 'విద్యా నిర్వాణ మంచు ఆనంద్'.
మంచు లక్ష్మి ఇటీవలే ఓ బిడ్డకు సరోగసీ ద్వారా తల్లయింది. అంటే అద్దెగర్భం ద్వారా పిల్లలను కనడం అన్నమాట. మంచు లక్ష్మి, ఆమె భర్త ఆండీకి సహజ పద్దతిలో పిల్లలు పుట్ట లేదు. చాలా కాలం పిల్లల కోసం డాక్టర్ల చుట్టూ తిరిగారు. ఈ పరిణామ క్రమంలో చివరకు పిల్లలు వద్దనుకున్నారు. కానీ సరోగసీ ద్వారా పిల్లలు పుట్టే అవకాశం ఉండటంతో ఆ విధంగా తల్లిదండ్రులయ్యారు.

విద్యా నిర్వాణ మంచు ఆనంద
మంచు లక్ష్మి కూతురు విద్యా నిర్వాణ మంచు ఆనంద్ జూన్ 15వ తేదీన జన్మించినట్లు తెలుస్తోంది.

రెండు వారాల ముందే....
మంచు లక్ష్మి కూతురు వాస్తవానికి రెండు వారాల ముందు జన్మించాలి. కానీ మెడచుట్టూ బొడ్డతాడు చుట్టుకోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో ముందు సిజేరియన్ చేయాల్సి వచ్చిందట.

ఈ పద్దతి అనుసరించడానికి...
మంచు లక్ష్మి, ఆండీ దంపతులు సరోగసీ పద్దతి అనుసరించడానికి వారికి సహజ సిద్దంగా పిల్లలు పుట్టే అవకాశం లేక పోవడమే. ఎన్నో తర్జన భర్జనల తర్వాత వారు ఈ నిర్ణయం తీసుకున్నారు.

వారి వల్లే...
ఒకానొక సమయంలో పిల్లలను వద్దనుకున్న మంచు లక్ష్మి, ఆండీ దంపతులు....విష్ణు కూతుర్లయిన అరియానా, వివియానా అల్లరి చూసిన తర్వాత తమకూ బిడ్డ ఉంటే బాగుండనే ఆలోచనకు వచ్చారు.


Click it and Unblock the Notifications











