twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఇది వినాయకుడి పండగా? కాంపిటీషనా?... కేటీఆర్‌కు మంచు లక్ష్మి లేఖాస్త్రం!

    గణపతి ఫెస్టివల్ మీద మంచు లక్ష్మి ఓపెన్ లెటర్. ఇది పండగలా కాకుండా పోటీలా సాగుతోందన్నారు.

    By Bojja Kumar
    |

    గణపతి నవరాత్రోత్సవాలు రాను రాను పండగలా కాకుండా..... తమ గొప్పలు నిరూపించుకునే కాంపిటీషన్ మాదిరిగా తయారవుతున్నాయని, కొందరు తమ గొప్పల కోసం చేసే పనుల వల్ల సామాన్య ప్రజలు అవస్తలు పడుతున్నారని, దీనిపై మంత్రి కేటీఆర్ లాంటి వారు ఇలాంటి వాటిపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని ఆమె ఓ బహిరంగ లేఖాస్త్రం సాధించారు

    పండగను పండగలా జరుపుకోవాలని..... పండగ రాగానే అందరూ ఆనందంగా ఉండాలి, కానీ ప్రజలు ఇబ్బంది పడే పరిస్థితులు ఉండకూడదని మంచు లక్ష్మి అభిప్రాయ పడ్డారు. ఆమె తన తన బహిరంగ లేఖాస్త్రంలో ఏం పేర్కొన్నారో చూద్దాం.

    ఇలా ఇబ్బందులు పెట్టడం ఏమిటి?

    ఇలా ఇబ్బందులు పెట్టడం ఏమిటి?

    వినాయక చవితి సందర్బంగా ఫిల్మ్ నగర్ ఏరియాలో భారీగా స్వాగత ద్వారాలు ఏర్పాటు చేశారు. భారీ వినాయక మండపాలు రోడ్డుపై ఏర్పాటు చేశారు. దీని వల్ల సామాన్య ప్రజలు ట్రాఫిక్ ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని, ఒక ఫిల్మ్ నగర్లో మాత్రమే కాదు, హైదరాబాద్ నగరం అంతటా ఇదే పరిస్థితి ఉందని ఆమె అన్నారు.

    వాటికి బాధ్యత ఎవరు?

    వాటికి బాధ్యత ఎవరు?

    చాలా చోట్ల పెద్ద పెద్ద విగ్రహాలు ఏర్పాటు చేస్తున్నారు. విగ్రహాలకు అడ్డువస్తున్నాయని కేబుల్స్ కట్ చేసి వాటిని అలానే వదిలేస్తున్నారు. ఇలాంటి వాటికి ఎవరు బాధ్యత వహిస్తారు అని మంచు లక్ష్మి పేర్కొన్నారు.

    ఇదేమైనా కాంపిటీషనా?

    ఇదేమైనా కాంపిటీషనా?

    వినాయక నవరాత్రోత్సవాలు అనేది మతమరమైన పండగ. కానీ ఇక్కడ ఇది పండలా కాకుండా కాంపిటీషన్ మాదిరిగా సాగుతోంది అని మంచు లక్ష్మి అభిప్రాయ పడ్డారు.

    కేటీఆర్ లాంటివారు స్పందించాలి

    కేటీఆర్ లాంటివారు స్పందించాలి

    ఈ కాంపిటీషన్ కారణంగా ప్రజలు పడుతున్న ఇబ్బందులను మంత్రి కేటీఆర్ లాంటి వారు గమనించాలి, వారు ఇబ్బందులు పడకుండా తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు.

    English summary
    Lakshmi Manchu‏ heartfelt letter on the eve of GaneshChaturthi. In the letter, she wrote, “The Ganesh festival is not treated as a religious affair anymore but a competition! Every locality is putting all their energy into outdoing the other in the context of the grandeur of the celebrations. I suggest that there be a local Pandal among localities. This will not only encourage unity but also reinstate the motive of celebrating together and safeguard the tradition.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X