అమితాబ్‌ను ప్లాట్ చేసిన మంచు లక్ష్మి
సీనియర్ యాక్టర్ మోహన్‌బాబు కుటుంబం నుంచి ఆయన వారసులుగా ఇద్దరు కుమారులు విష్ణు, మనోజ్‌తో పాటు కూతురు మంచు లక్ష్మి కూడా తెరంగ్రేటం చేసింది. అయితే వీరిలో బాగా పాపులర్ అయింది మాత్రం లక్ష్మి మాత్రమే. తను నిర్వహించే టాక్ షో ద్వారా ప్రేక్షకులకు దగ్గరైంది. అదే ఊపుతో ఇప్పడు సినిమాల్లోనూ రాణిస్తోంది. అయితే లక్ష్మి ఇప్పడు జాక్ పాట్ కొట్టినట్టు చర్చించుకుంటున్నారు. ఆ జాక్ పాట్ ఏమిటో తెలుసా? బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ ను ఇంప్రెస్ చేయడమే.
ప్రస్తుతం లక్ష్మి రాంగోపాల్ వర్మ రూపొందిస్తున్న డిపార్టుమెంట్ అనే బాలీవుడ్ చిత్రంలో నటిస్తోంది. ఇందులో అమితాబ్ బచ్చన్ లీడ్ రోల్ చేస్తున్నాన్నారు. యూనిట్ సభ్యులు నుంచి అందిన సమాచారం ప్రకారం...లక్ష్మి నటన అమితాబ్‌ను బాగా ఇంప్రెస్ చేసిందట. షూటింగ్ స్పాట్ లోనే ఆమెను అనేక సార్లు స్వయంగా అభినందించాడట. అంతే కాదు తన ఇప్లూయెన్స్ ఉపయోగించి మరిన్ని బాలీవుడ్ సినిమాల్లో ఆమెకు అవకాశం ఇప్పించేందుకు రికమండ్ చేస్తున్నాడట. అందుకే లక్ష్మి జాక్ పాట్ కొట్టేసిందంటూ చర్చించుకుంటున్నారు బాలీవుడ్ జనాలు.


Click it and Unblock the Notifications











