twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    గోల గోల: మంచు లక్ష్మి ‘ఐస్ బకెట్ చాలెంజ్’(వీడియో)

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: గత కొన్ని రోజులుగా ప్రపంచ వ్యాప్తంగా ఐస్ బకెట్ చాలెంజ్ నడుస్తున్న సంగతి తెలిసిందే. మాజీ మైక్రోసాఫ్ట్ సీఈఓ బిల్ గేట్స్, ఫేస్ బుక్ అధినేత మార్క్ జుకర్ బెర్గ్ సహా హాలివుడ్ నటులు, బాలీవుడ్ నటులూ, పలువురు సెలబ్రిటీలు, సాధారణప్రజలూ 'ఏఎల్ ఎస్ ఐస్ బకెట్ చాలెంజ్' లో పాల్గొంటున్నారు. ఓ క్యాన్సర్ చారిటబుల్ ట్రస్టుకు విరాళం ఇవ్వడంలో భాగంగా ఈ ఐస్ బకెట్ చాలెంజ్ జోరుగా సాగుతోంది.

    <center><iframe width="100%" height="360" src="//www.youtube.com/embed/1aJ13MDf2QE?feature=player_detailpage" frameborder="0" allowfullscreen></iframe></center>

    తాజాగా ఈ లిస్టులో తెలుగు నటి మంచు లక్ష్మి కూడా చేరి పోయారు. ఒక మంచి పని కోసం జరుగుతున్న కార్యక్రమం కావడంతో తానూ ఈ ఐస్ బకెట్ చాలెంజ్ లో పాల్గొన్నట్లు మంచు లక్ష్మి చెప్పుకొచ్చారు. తన స్నేహితులైన ప్రదీప్, స్వప్న చిలుకురి తనకు ఐస్ బకెట్ చాలెజండ్ చేయడంతో స్వీకరించిన మంచు లక్ష్మి తన స్నేహితులైన తాప్సీ, యువరాజ్ సింగ్, జీవి కేశవ్‌లకు ఐస్ బకెట్ చాలెంజ్ చేసింది.

     Lakshmi Manchu Joins Ice Bucket Challenge

    ఐస్ బకెట్ చాలెంజ్ అంటే ఏమిటి?
    జాన్ ఫ్రేట్స్ అనే వ్యక్తి ఈ సరికొత్త కాన్సెప్టుకు తెరతీశాడు.. ఆయన 29 ఏళ్ల కుమారుడు పీటర్ కు అమీయో ట్రాఫిక్ లాటరల్ సెరోసిస్ ఏ ఎల్ ఎస్ అనే అరుదైన వ్యాధి సోకింది. దీని గురించి ప్రచారం, కాన్సర్ నిర్మూలనకు పని చేస్తున్న సంస్థకు విరాళం దృష్టిలో పెట్టుకుని జూన్ నెలలో ఫేస్ బుక్ లో ఓ వీడియో పోస్టు చేశాడు...అక్కడ నుండి మొదలయిన ఐస్ బకెట్ చాలెంజ్ అంతటా విస్తరించింది. ఈ ఐస్ బకెట్ చాలెంజ్ స్వీకరించిన ఒక్కొక్కరు మరో ముగ్గురిని సవాల్ చేస్తుండటంతో వేగంగా విస్తరించింది. సోషల్ మీడియా ద్వారా ఇది బాగా ప్రచారంలోకి వచ్చింది. విరాళాలు కూడా బాగా వస్తున్నాయి.

    English summary
    "I accepted Pradeep & Swapna Chilukuri's ALS Ice Bucket Challenge,to spread the awareness for ALS (Lou Gehrig's Disease), and I further nominate My friends Taapsee Pannu, G V Keshav and Yuvraj Singh Gotta do it within 24hrs - time starts now" Lakshmi Manchu said.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X