జిమ్ లో...మంచు లక్ష్మి జిమ్మిక్కులు (వీడియో)
హైదరాబాద్ : కూటి కోసం కోటి విద్యలు అన్నచందంగా....పబ్లిసిటీ కోసం సినిమా స్టార్స్ చేసే జిమ్మిక్కులు అన్నీ ఇన్ని కావు. తాజాగా మంచు లక్ష్మి జిమ్ లో వర్కౌట్లు చేస్తున్న ఓ వీడియో విడుదలైంది. తన అందమైన బాడీని మెయింటేన్ చేయడానికి ఆమె ఎంత కష్టపడుతుందో ఈ విడియోను చూసి అర్థం చేసుకోవచ్చు. తాను యాక్షన్ హీరోలా ఫీలవుతున్నట్లు మంచు లక్ష్మి పేర్కొంది.
మంచు లక్ష్మి సినిమాల విషయానికికొస్తే... ఆమె ప్రస్తుతం పిలవని పేరంటం అనే చిత్రంలో నటిస్తోంది. ఇందులో కమెడియన్ ధనరాజ్ కూడా ప్రధాన పాత్ర పోషిస్తున్నాడు. హీరోయిన్ ఓరియెంటెడ్ గా నడిచే ఈ హర్రర్ కామెడీలో మంచు లక్ష్మి కీలక పాత్ర పోషిస్తోంది. ప్రియదర్శిని మూవీస్ మరియు జైన్ మూవీస్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ చిత్ర ప్రారంబోత్సవంలో రాఘవేంద్రరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

రొటీన్ సినిమాల్లో రోటీన్ పాత్రలు చేయకుండా...విభిన్నమైన కథలు, విభిన్నమైన పాత్రలు చేయడానికే ప్రాముఖ్యత చూపుతున్న నటి మంచు లక్ష్మి త్వరలో ‘పిలవని పేరంటం' అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. పిలవని పేరంటం' చిత్రానికి వెంకన్న బాబు దర్శకుడు. గతంలో ఆయన ‘జగన్ నిర్దోషి' చిత్రానికి దర్శకత్వం వహించారు.


Click it and Unblock the Notifications











