For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  సన్నిలియోన్‌ను ఫాలో అవుతున్న మంచులక్ష్మీ.. లాక్‌డౌన్‌లో టాప్ పొలిటిషియన్‌తో..

  |

  టాలీవుడ్‌లో విభిన్నమైన పాత్రలతో ఆకట్టుకొంటున్న నటి లక్ష్మీ మంచు యాంకర్, హోస్ట్‌గా కూడా రాణిస్తున్నారు. సినిమాలు, టెలివిజన్, వెబ్ సిరీస్, సోషల్ మీడియా ఫ్లాట్‌ఫాంలో సందడి చేస్తూ తన ప్రతిభను చాటుకొంటున్నది. ఇటీవల కాలంలో వెబ్, సోషల్ మీడియాలో విశేషమైన ప్రాచుర్యం సంపాదించుకొన్న ఇన్స్‌టాగ్రామ్, వాట్సప్‌లో లక్ష్మీ మంచు తనదైన శైలిలో రాణిస్తున్నారు. అయితే ఇటీవల లక్ష్మి మంచు దూసుకెళ్తున్న తీరు చూస్తే ఇంటర్నేషనల్ స్టార్ సన్నీలియోన్ ఫాలో అవుతున్నారా అనే సందేహం కలుగక మానదు. అది ఎలా అంటే..

  సన్నిలియోన్ లైవ్ ఛాట్ షో

  సన్నిలియోన్ లైవ్ ఛాట్ షో

  అత్యంత ప్రతిభావంతురాలైన సన్నీలియోన్ తాజాగా లాక్‌డౌన్ సమయంలో ఇన్స్‌టాగ్రామ్‌లో లాక్‌డ్ అప్ విత్ సన్నీలియోన్ అనే షోను ప్రారంభించారు. ఆ షోలో కరిష్మా తన్నా, జరీన్ ఖాన్, దబ్బూ రత్నానీ, క్రికెటర్ డ్వేన్ డీజే బ్రావోతో ముచ్చటించి పలు విషయాలను నెటిజన్లకు అందించారు. అలాంటి షోనే మంచు లక్ష్మీ ప్రస్తుతం లాక్‌డ్ అప్ విత్ మంచు లక్ష్మీ అనే షోను ప్రారంభించారు.

  సెలబ్రిటీలతో లక్ష్మీ మంచు

  సెలబ్రిటీలతో లక్ష్మీ మంచు

  లాక్‌డ్ అప్ విత్ లక్ష్మీ మంచు షో గురించి లక్ష్మీ మంచు వెల్లడిస్తూ.. కరోనాపై పోరాటం చేస్తున్న సమయంలో మన చుట్టూ ఏం జరుగుతున్నది. ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకొంటున్నదనే విషయాన్ని తెలుసుకోవడానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో మాట్లాడుదామంటూ ఏప్రిల్ 28న ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. అందులో భాగంగా మే 4 తేదిన రాంగోపాల్ వర్మతో, మే 6 తేదీన శిల్పారెడ్డితో లైవ్ చాటింగ్ చేశారు.

  కాంగ్రెస్ నేత శశిథరూర్‌తో

  కాంగ్రెస్ నేత శశిథరూర్‌తో

  అలాగే తన షోను మరింత ముందుకు తీసుకెళ్తూ కాంగ్రెస్ నేత శశిథరూర్‌తో శనివారం (మే 9న) ఇన్స్‌టాగ్రామ్‌ లైవ్‌లో ముచ్చటించనున్నారు. శశితో ముచ్చటించే ముందు నా చేతిలో డిక్షనరీ సిద్ధంగా ఉంటాను. ఆయనతో మాట్లాడాలంటే ఆ మాత్రం జాగ్రత్తలైనా తీసుకోవాల్సిందే. కాబట్టి మీరు కూడా శనివారం 6.30 గంటలకు సిద్ధంగా ఉండండి అంటూ లక్ష్మీ మంచు తన ట్వీట్‌లో పేర్కొన్నారు.

  వూట్ యాప్‌లో సెలబ్రిటీ షో

  వూట్ యాప్‌లో సెలబ్రిటీ షో

  గతంలో లక్ష్మీ మంచు వూట్ యాప్‌లో సెలబ్రిటీల షో ఫీట్ అప్ విత్ ది స్టార్ అనే కార్యక్రమాన్ని నిర్వహించి.. కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ సింగ్, శృతిహాసన్, నిధి అగర్వాల్, సమంత అక్కినేని, వరుణ్ సందేశ్, నిఖిల్‌తో సుదీర్ఘమైన సంభాషణ చెప్పడం తెలిసిందే. ఆ షోకు కూడా మంచి స్పందన వచ్చిన విషయం తెలిసిందే.

  Tollywood And Bollywood Celebrities Participated in Modi's 9 PM 9 Baje Light Lamps event
  లక్ష్మీ మంచు కెరీర్..

  లక్ష్మీ మంచు కెరీర్..

  లక్ష్మీ మంచు కెరీర్ విషయానికి వస్తే.. టాలీవుడ్‌లో నటిగా, నిర్మాతగా తన వంతుగా సినిమాలను నిర్మిస్తూ నటిస్తున్నారు. అమెరికాలో యాక్టింగ్ శిక్షణ పూర్తి చేసి లాస్ వెగాస్‌లో అమెరికన్ టెలివిజన్ సిరీస్‌లో నటించారు. ప్రేమతో మీ లక్ష్మీ, మేము సైతం, మీ కోసం లాంటి పాపులర్ షోలను నిర్వహించి బుల్లితెర ప్రేక్షకులను కూడా మెప్పించారు.

  English summary
  Locked up with Lakshmi Manchu Show in Instagram going with sensation. She is going to Chat with Congress leader Shashi Tharoor. She tweeted that Woo-hoo! I'm super duper excited for this one. Yep, I have my dictionary handy. Tune in. This Saturday at 6.30pm on my Insta.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X