లక్ష్మీ ప్రసన్న మంచుకి గోల్డెన్ ఆఫర్
నిర్మాతగా, నటిగా దూసుకువెళ్తున్న మంచు లక్ష్మీ ప్రసన్నకి ఓ గోల్డెన్ ఆఫర్ వచ్చింది. అది మరేదో కాదు మణిరత్నం చిత్రంలో ఆమెకు ఓ కీ రోల్ కి ఎంపిక అయ్యింది. ప్రస్తుతం సంజయ్ దత్ సరసన డిపార్టమెంట్ చిత్రంలో చేస్తున్న ఆమెను మణిరత్నం తన తదుపరి చిత్రంలో ఎంపిక చేసుకున్నారు. డిపార్టమెంట్ చిత్రంకోసం రామ్ గోపాల్ వర్మ రిలీజ్ చేసిన ఆమె స్టిల్స్ చూసిన మణి వెంటనే ఆ పాత్రకు లక్ష్మి అయితే న్యాయం చేయగలని నిర్ణయించుకన్నట్లు చెప్తున్నారు. అయితే ఆమె పాత్ర గురించి మాత్రం డిటేల్స్ ఏమీ తెలియరాలేదు. ఇక ఈ విషయాన్ని లక్ష్మి తన ట్విట్టర్ లో కన్ఫర్మ్ చేసింది. ఆమె ఈ విషయం ప్రస్తావిస్తూ... నేను ఇప్పుడే మణిరత్నం చిత్రానికి సైన్ చేసాను. ఇది నా తొలి తమిళ చిత్రం. ఆయనే నన్ను సినిమాలంటే ఆసక్తి కలిగించి, ఇన్ఫూలియన్స్ చేసిన వ్యక్తి, నా కలలు నిజమయ్యాయి అంటూ ట్వీట్ చేసింది.
మంచు లక్ష్మీ ప్రసన్న ఇప్పుడు చాలా హ్యాపీగా ఉంది.రామ్ గోపాల్ వర్మ దర్సకత్వంలో ఆమె హిందీలో డిపార్టమెంట్ చిత్రంలో చేస్తోంది. ఈ విషయమై ఆమె మాట్లాడుతూ.. రాముతో పనిచేయటం చాలా వండ్రఫుల్ ఎక్సపీరియన్స్. సినిమా చాలా గొప్పగా వస్తోంది. అందులోనూ రానా ఉండటంతో చాలా ఫన్ గా షూటింగ్ గడిచిపోతోంది. ఇక ఈ చిత్రంలో సంజయ్ దత్ సరసన నటిస్తున్నాను. అతని సినిమాలు చూస్తూ పెరిగిన దాన్ని కావటంతో అతనితో సినిమా చేయటం చాలా ధ్రిల్లింగ్ గా ఉంది. ఇక నా రోల్ ఈ చిత్రంలో నా నిజ జీవితానికి దగ్గరగా ఉండేది. నా ఇతర సినిమాల్లోలాగ ఇందులో సంప్రదాయబద్దంగా కనపడను. చాలా ఫంకీగా ఉంటాను. అలాగే ఈ చిత్రం నాకు బాలీవుడ్ లో బ్రేక్ ఇస్తుందని భావిస్తున్నాను. అలాగే చాలామంది నటీమణులు వయస్సు కేవలం పద్దేనిమిది నుంచి ఇరవై ఐదు మధ్య ఉంటేనే రాణిస్తామనుకుంటారు.. అది తప్పు అంది.


Click it and Unblock the Notifications











