హైదరాబాద్: 'దేనికైనా రెడీ' చిత్ర నిర్మాత మోహన్ బాబు ఇంటి ముందు బుధవారం రాత్రి బ్రాహ్మణులు చేపట్టిన ఆందోళన ఉద్రిక్తతకు దారి తీసింది. మోహన్‌బాబు ఇంటి ఎదుట నిరసన తెలిపేందుకు వచ్చిన బ్రాహ్మణులను ఆయన అనుచరులు తరిమికొట్టారు. పోలీసుల ఎదుటే కర్రలతో కొట్టారు. ధర్నా చేస్తున్న బ్రాహ్మణ ప్రతినిధులపై ఆయన అనుచరులు విచక్షణా రహితంగా దాడిచేయగా, పలువురు గాయాల పాలయ్యారు. ఈ విషయమై మంచు మనోజ్, మంచు లక్ష్మి తమ ట్విట్టర్ లో తమ దైన శైలిలో స్పందించారు.
మంచు మనోజ్ ట్వీట్ లో... "ఇది బ్రాహ్మణులు గురించి కాదు..మా కుటుంబాన్ని మేము రక్షించుకునేందుకు చేసిన ప్రయత్నం...ఆడవాళ్లు ఉన్నప్పుడు మాత్రమే వారు దాడికి దిగారు. ఆ సమయంలో మా నాన్నగారు తిరుపతిలో, నేను చెన్నైలో,విష్ణు బయిట ఉన్నాం. మా అమ్మ,మా సోదరి ఇంటివద్ద ఒంటిరిగా ఉన్నారు... ఎవరైనా ఆ సమయంలో మాలాగానే స్పందిస్తారు... బ్రాహ్మణలు కూడా ఇలాంటివి ఒప్పుకోరు. నిజమైన బ్రాహ్మణులు ఎవరూ ఇలాంటి సిల్లీ పనులు చేయరు. ఏదన్నా వివాదం ఉంటే కోర్టులో తేల్చుకోండి...మా ఇళ్ళపై ఎటాక్ చేయకండి ...," అని రాసారు.
మంచు లక్ష్మి ప్రసన్న ఈ విషయమై ట్వీట్ చేస్తూ... "దేనికైనా రెడీ చిత్రం పెద్ద హిట్టైంది. మేము అందరిని ప్రేమిస్తాం. అన్యాయం జరిగినప్పుడు ఎవరూ చూస్తూ ఊరుకోరు. బ్రాహ్మణులు ఎటాక్ చేసినప్పుడు మా అమ్మ ఒకత్తే మాత్రమే ఇంటివద్ద ఉంది. ఇది సహించే విషయం కాదు. చాలా ఇరిటేటింగ్ గా ఉంది. గాడ్ బ్లెస్ ఇండియా. నాన్నగారు హైదరాబాద్ లో ఉంటే ఆందోళనకారులు మా ఇంటివైపు రారు. వారు తమ హోమ్ వర్క్ చేసుకుని దిగారు. నాన్న గారు లేనప్పుడు చూసి మరీ దాడి చేసారు ," అంటూ ఆమె స్పందించారు.
మంచు విష్ణు మాట్లాడుతూ... సినిమా అనేది కల్పితమని, అంతవరకే చూడాలని అన్నారు. తాము హిందువులమేనని, తమ ఇంటిలో ప్రతి శుభకార్యానికి బ్రాహ్మణులనే ఆహ్వానిస్తామని విష్ణు స్పష్టంచేశారు. తన తల్లి ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో వారే దాడికి యత్నించారని, అందుకే తాము స్పందిచాల్సి వచ్చిందన్నారు. సినిమా విడుదలైన ఐదు రోజుల తర్వాత ఆందోళనలకు దిగడం పట్ల ఆయన అనుమానం వ్యక్తం చేశారు. 'దేనికైనా రెడీ' అంటూ సవాల్ విసిరారు.
Lakshmi Manchu tweeted..."Tweeple, there is a huge controversy around all that is happening. Media and press pls dont stress. We r on the people who r behind it. No matter what #DKR is a huge hit. We love all people..the truth shall prevail. Nobody will keep quite when injustice happens. My mom was home alone when "bramhins" came and attacked my home. Not acceptable. Soooo irritating! Grrrrr. God Bless India. If dad was in hyd "the attackers" wouldnt have even come home.. They did their homework. Found out that dad was out of town and came. Cowards," she wrote.
Story first published: Thursday, November 1, 2012, 9:59 [IST]