»   » రాజమౌళి అసిస్టెంట్‌తో మంచు లక్ష్మి.... పూర్తి వివరాలు ఇవే!

రాజమౌళి అసిస్టెంట్‌తో మంచు లక్ష్మి.... పూర్తి వివరాలు ఇవే!

Posted By:
Subscribe to Filmibeat Telugu

మంచు ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్ పై ప్రొడ‌క్ష‌న్ నెం.4 గా, విజ‌య్ య‌లంకంటి అనే కొత్త ద‌ర్శ‌కుడిని ప‌రిచ‌యం చేస్తూ, నిర్మించ‌నున్న చిత్రం గురువారం హైద‌రాబాద్ లో పూజా కార్య‌క్ర‌మాల‌తో లాంఛ‌నంగా ప్రారంభ‌మైంది. పూజానంత‌రం మంచు మ‌నోజ్, మ‌నోజ్ భార్య ప్ర‌ణ‌తి, మంచు ల‌క్ష్మి కూతురు విద్యా నిర్వాణ స్క్రిప్ట్ ను నిర్మాత మంచు ల‌క్ష్మి, డైర‌క్ట‌ర్ విజ‌య్ ల‌కు అందించారు.

ఈ సందర్భంగా న‌టి, నిర్మాత మంచు ల‌క్ష్మి మాట్లాడుతూ, చాలా రోజుల త‌ర్వాత మా బ్యాన‌ర్ నుంచి వ‌స్తున్న సినిమా ఇది. నిజం కాని విష‌యాన్ని నిజ‌మ‌ని భావించే ఓ యువ‌తి క‌థ ఆధారంగా తెర‌కెక్కుతున్న ఈ సినిమా, మ‌నిషి ఎమోష‌న్స్, రిలేష‌న్‌షిప్స్ చుట్టూనే క‌థంతా తిరుగుతుందని తెలిపారు.

రాజమౌళి అసిస్టెంట్

రాజమౌళి అసిస్టెంట్

దర్శకుడు విజయ్ గురించి మాట్లాడుతూ... విజ‌య్ ఇప్ప‌టికే ఈగ‌, బాహుబ‌లి-1 సినిమాల‌కు రాజ‌మౌళి గారి దగ్గ‌ర అసిస్టెంట్ డైర‌క్ట‌ర్ గా ప‌నిచేశాడు. ఈ సినిమాతో ఖ‌చ్చితంగా త‌న ప్ర‌తిభ‌ను నిరూపించుకుంటాడు అన్నారు.

Manchu Vishnu's Achari America Yatra Was Launched - Filmibeat Telugu
త్వరలో వెబ్ సిరీస్

త్వరలో వెబ్ సిరీస్

సినిమాతో పాటూ య‌ప్ టీవీ ఆధ్వ‌ర్యంలో ఓ వెబ్ సిరీస్ ను కూడా మొద‌లుపెట్ట‌బోతున్నాం. వీటికి సంబంధించిన న‌టీన‌టులు, సాంకేతిక నిపుణులు మ‌రిన్ని వివ‌రాలు త్వ‌ర‌లోనే వెల్ల‌డిస్తామ‌న్నారు.

మంచు లక్ష్మి

మంచు లక్ష్మి

మంచు ల‌క్ష్మి ప్ర‌ధాన‌పాత్ర‌లో న‌టించనున్న, ఈ సినిమాకు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్ గా సుహాసిని, ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్ గా పెళ్లి చూపులు సినిమాకు ప‌ని చేసిన ల‌త పనిచేస్తున్నారు.

మరిన్ని వివరాలు

మరిన్ని వివరాలు

మంచు లక్ష్మికి సంబంధించిన మరిన్ని వివరాల కోసం...

క్లిక్ చేయండి

English summary
Manchu Lakshmi’s Manchu Entertainments Prod. No. 4 Movie Pooja held at Hyderabad. Vijay Yalankanti, Manoj, Manoj’s wife Pranathi and Manchu Lakshmi’s daughter Vidhya Nirvana at the event.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu