మోహన్ బాబు కుమార్తె లక్ష్మీ ప్రసన్న త్వరలో హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వనుంది. ఈ విషయం ఆమే స్వయంగా మీడియాకు తెలియపరిచింది. తన సోదరుడు విష్ణు నిర్మించనున్న హీరోయిన్ ఓరియంటెండ్ చిత్రంలో ఆమె నటించనుంది. గతంలో ఆమె హాలీవుడ్ లో అనేక టీవీ షోలు చేసింది. అలాగే అక్కడ నుంచి వచ్చాక ఆమె తమ హోమ్ ప్రొడక్షన్స్ లో నిర్మించే చిత్రాల్లో ఇన్వాల్స్ అయిన అనుభవం ఉంది. ఇక ఆమె లాస్ ఏంజిల్స్ లో లక్ష్మీ మంచు పేరుతో నటిగా ట్రైనింగ్ సైతం అయ్యింది. అమెరికన్ సిట్యువేషనల్ కామిడీల్లో నటించి మంచి పేరు తెచ్చుకుంది. ప్రస్తుతం ఆమె లక్ష్మీ టాక్ షో పేరుతో ఓ టీవీ షోను జీ టీవీలో నిర్వహిస్తోంది. ఈ షో కి మంచి కామెంట్స్ అంతటా వినపడుతున్నాయి. కాఫీ విత్ కరణ్ తరహాలో ఈ పోగ్రామ్ సాగుతుంది. బెస్టాఫ్ లక్ లక్ష్మీ...