మంచు లక్ష్మి రియల్ ఫైటింగ్
నిర్మాతగా, నటిగా ఇప్పుడిప్పుడే గుర్తింపు తెచ్చుకుంటున్న మంచు లక్ష్మిప్రసన్న ఇప్పుడు విజయశాంతి లెవల్లో రియల్ ఫైటింగులు సైతం చేస్తోంది. మనోజ్ హీరోగా రూపొందుతున్న 'ఊ కొడతారా ఉలిక్కి పడతారా' చిత్రంలో లక్ష్మి ఎలాంటి డూపు లేకుండా స్టంట్స్ చేస్తోంది. ఈ స్టంట్స్ కంపోజ్ చేసేది ఎవరో కాదు...ఆవిడ తమ్ముడు మంచు మనోజే. ఈ విషయాన్ని మనోజ్ స్వయంగా తన ట్విట్టర్ ద్వారా వెల్లడించాడు. స్టంట్స్ చేయడంలో అక్కయ్య సామర్థ్యాన్ని చూసి మురిసి పోతున్న మనోజ్...ఆమె నా బెస్ట్ స్టూడెంట్ అంటూ ట్వీట్ చేశాడు.
ఉకొడతారా ఉలిక్కి పడతారా చిత్రం సూటింగ్ దాదాపుగా కంప్లీట్ కావస్తోంది. తెలుగు, తమిళంలో ఒకేసారి విడుదల కాబోతున్న ఈ సినిమాలో నందమూరి బాలకృష్ణ ముఖ్య పాత్రను పోషిస్తున్నారు. ఇందులో బాలయ్య జమిందార్ నరసింహ రాయుడుగా కనిపించనున్నారు. ఈ చిత్రంలో మనోజ్ సరసన దీక్షా సేథ్ నటిస్తోంది. మంచు లక్ష్మి ప్రసన్న మంచు ఎంటర్ టైన్మెంట్ బ్యానర్ పై నిర్మిస్తోన్న ఈ చితానికి కథ, స్ర్కీన్ ప్లే, దర్శకత్వం శేఖర్ రాజ. బెబో శశి సంగీతం అందిస్తున్నారు. బి. రాజశేఖర్ సినిమాటోగ్రఫర్ గా పని చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











