కూతురుతో కలిసి మంచు లక్ష్మి ఇలా...(ఫోటో)
హైదరాబాద్: నటి మంచు లక్ష్మి మహాశివరాత్రిని పురస్కరించుకుని తన కూతురు విద్యా నిర్వాణతో కలిసి శివ పూజ చేసింది. అందుకు సంబంధించిన ఫోటోను తన అభిమానులతో షేర్ చేసుకుంది. అటు కెరీర్, ఇటు ఫ్యామిలీని బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగుతున్న మంచు లక్ష్మి....సాంప్రదాయలపై కూడా నమ్మకం, గౌరవం ఎక్కువే.
ఫేస్‌బుక్, ట్విట్టర్, గూగుల్ ప్లస్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు
మంచు లక్ష్మి కూతురు పేరు 'విద్యా నిర్వాణ మంచు ఆనంద్'. సరోగసీ పద్దతి ద్వారా బిడ్డకు తల్లయింది. అంటే అద్దెగర్భం ద్వారా పిల్లలను కనడం అన్నమాట. మంచు లక్ష్మి, ఆమె భర్త ఆండీకి సహజ పద్దతిలో పిల్లలు పుట్ట లేదు. చాలా కాలం పిల్లల కోసం డాక్టర్ల చుట్టూ తిరిగారు. ఈ పరిణామ క్రమంలో చివరకు పిల్లలు వద్దనుకున్నారు. కానీ సరోగసీ ద్వారా పిల్లలు పుట్టే అవకాశం ఉండటంతో కుటుంబ సభ్యులతో చర్చించి ఆ పద్దతి ఫాలో అయ్యారు.

మంచు లక్ష్మి సినిమాల విషయానికొస్తే...మంచు లక్ష్మి ప్రధాన పాత్రలో 'బుడుగు' చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. హైదారాబాద్ ఇన్నోవేటివ్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై మన్మోహన్ దర్శకత్వంలో భాస్కర్, సారికా శ్రీనివాస్‌లు ఈ సినిమా నిర్మిస్తున్నారు. త్వరలో ఈ చిత్రం విడుదల కానుంది.
తల్లితండ్రులు తమ పిల్లలపై ఆశలు ఏవో ఆశలు పెట్టుకుంటే సామర్య్థానికి మించిన ఒత్తిడికి లోనయి ఆ పిల్లలు ఎలా తయారు అవుతారు. అలాంటి పరిస్థితి ఎదురైన ఒక పిల్లాడు, అతని చుట్టూ జరిగిన కొన్ని సంఘటనలతో అతని కుటుంబం ఎలాంటి సమస్యలు ఎదుర్కొంది, ఆ సమస్యల నుండి వారు ఎలా బయట పడ్డారు అనేది ఈ చిత్రం ముఖ్య కథ.


Click it and Unblock the Notifications











