»   » ‘మేమంతా ముస్లింలమే’ అంటున్న మంచు లక్ష్మి

‘మేమంతా ముస్లింలమే’ అంటున్న మంచు లక్ష్మి

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: తెలుగు సినిమా పరిశ్రమలో సంచలనాలకు కేంద్ర బిందువుగా ఉండే వారిలో నటి మంచు లక్ష్మి ఒకరు. తాజాగా ఆమె తన సోషల్ నెట్వర్కింగ్ సైట్లో పోస్టు చేసిన ఫోటో ఒకటి హాట్ టాపిక్ అయింది. ‘మేమంతా ముస్లింలమే' అంటూ మంచు లక్ష్మి ప్లకార్డు ప్రదర్శించడం చర్చనీయాంశం అయింది. ‘స్టాండప్ ఫర్ హ్యుమానిటీ, హ్యూమానిటీ లవ్, ఫ్యూచర్ అనే ట్యాగ్స్ తగిలించి మంచే లక్ష్మి ఈ ఫోటో పోస్టు చేసారు.

ప్రపంచ వ్యాప్తంగా టెర్రరిస్టు కార్యకలాపాల్లో ముస్లిం వర్గానికి చెందిన వారే ఎక్కువగా ఉండటం వల్ల వారిపై ఎక్కడికెళ్లిన ఓ వివక్ష కొనసాగుతోంది. ఇటీవల ఫ్రాన్స్ లో దాడి తర్వాత యూరఫ్, అమెరికాల్లో ఈ దోరణి మరింత ఎక్కువైంది. ఈ నేపథ్యంలో మంచి వారైన ముస్లిం ప్రజలకు తమ మద్దతు పలకడంలో భాగంగా పలువురు సెలబ్రిటీలు ఇలాంటి ప్లకార్డులు ప్రదర్శిస్తున్నారు.

Lakshmi Manchu Says, 'We Are All Muslims'

అందులో భాగంగానే మంచు లక్ష్మి ఈ పోస్టర్ ప్రదర్శించారు. కొందరు టెర్రరిస్టులు చేసే పనుల వల్ల మిగిలిన ముస్లింలపై వివక్ష చూపడం సరికాదు అనే సందేశం ఇవ్వడానికే మంచు లక్ష్మి ఇలా చేసారని అంటున్నారు.

English summary
In yet another shocking move, actress-producer Lakshmi Manchu has posted a picture on her social networking website, which almost shocked her followers. She came up with the picture where she is holding the placard that reads "We Are All Muslims".
Please Wait while comments are loading...