»   » మనసుని తాకుతున్న మంచులక్ష్మి "డెసిషన్"

మనసుని తాకుతున్న మంచులక్ష్మి "డెసిషన్"

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఆ ఇద్దరు దంపతులకీ పెళ్లయినతర్వాత మొదటి గర్భమే అబార్షన్ అయిపోయింది... మళ్ళీ తల్లి కావాలనికున్న ఆమె కి రెండో సారి గర్భం దాల్చాక తెలిసిన భయంకరమైన నిజమేమిటంటే... పుట్టబోయే బిడ్డ డౌన్ సిండ్రోమ్ అనే జన్యుపరమైన లోపం తో పుట్టబోతున్నాడు. కానీ బిడ్దపుట్టే సంతోషం వాళ్ళలో ఎక్కువ సేపు నిలవలేదు...పుట్టుకతోనే ఒక జన్యుపరమైన లోపంతో పుట్టబోతున్నాడా పిల్లవాడు

మై నేమ్ ఈజ్ ఖాన్

మై నేమ్ ఈజ్ ఖాన్

ఆటిజం లాంటి లక్షణాలతో ఉండే ఈ లోపం వల్ల అతను మిగతా పిల్లలకంటే భిన్నంగా ఉంటాడు. మై నేమ్ ఈజ్ ఖాన్ సినిమా చూసారు కదా అందులో షారూఖ్ ఖాన్ కి ఉండే వ్యాది ఇదే. మరిప్పుడు ఆ తల్లి ఏం చేయాలి మానసిక లోపం తో ఉండే బిడ్దని భూమి మీదకు తీసుకు రావాలా?

రెండు సమాధానాలు

రెండు సమాధానాలు

ఇదే సిండ్రోమ్ తో పుట్టిన వాళ్లలో ఎన్నో అద్బుతాలు సాధించిన వాళ్ళున్నారు, ఎన్నొ యూనివర్సిటీల్లో టాపర్లున్నారు కానీ అలాంటి పిల్లలను పెంచటం ఒక సవాల్. అలా మానసికంగా లోపం ఉన్న పిల్లవాన్ని పెంచుకోవటం సరైన పనేనా..? ఇప్పుడా తల్లిముందు రెండు సమాధానాలున్నాయి...

నిర్ణయం ఏమిటి?

నిర్ణయం ఏమిటి?

ఒకటి ఆ మానసిక లోపం తో పుట్టబోయే బిడ్దని గర్భం లోనే చిదిమివేసెయ్యటం లేదా వాన్ని భూమిమీదకు తీసుకువచ్చి పూర్తి జీవితాన్ని వాడి కోసం త్యాగం చేసైనా వాన్ని మామూలుగా పెంచటం... మరప్పుడా తల్లి తీసుకునే నిర్ణయం ఏమిటి? ఆమె చాయిస్ గా తీసుకున్న "డెసిషన్ ఏమిటీ???"

ద డెసిషన్ అనే షార్ట్ ఫిలిం

ద డెసిషన్ అనే షార్ట్ ఫిలిం

ద డెసిషన్ అనే షార్ట్ ఫిలిం కథ ఇది. శ్రీను పంద్రంకి దర్శకత్వంలో రూపొందిన 'ది డిసెషన్' అనే షార్ట్ ఫిలింలో మంచు లక్ష్మి నటించింది. దీని నిడివి 21 నిమిషాలు కాగా.. ఒక బిడ్డకు జన్మనివ్వడం విషయంలో కీలకమైన నిర్ణయం తీసుకోవాల్సిన యువతిగా మంచు లక్ష్మి నటించింది.

ఛాలెంజింగ్ పాత్ర

ఛాలెంజింగ్ పాత్ర

ఇలాంటి పాత్రను చేయడం నిజంగా ఛాలెంజింగ్ అని చెప్పింది. తాను కూడా ఒక తల్లిని కావడంతో... ఈ పాత్రకు చాలా కనెక్ట్ అయ్యానని తెలిపింది. ప్రతి తల్లి, తండ్రి చూడాల్సిన ఫిలిం ఇది అంటూ ఇలా చెప్పింది.... 'ఇలాంటి మల్టిపుల్ షేడ్స్ ఉన్న కేరక్టర్ చేయడం ఏ ఆర్టిస్ట్ అయినా ఛాలెంజింగ్ గానే ఉంటుంది. ఒక తల్లిగా ఈ స్టోరీ లైన్ కు నేను ఫ్లాట్ అయిపోయాను. ప్రతీ పేరెంట్ ఈ షార్ట్ ఫిలిం నుంచి తెలుసుకోవాల్సిన విషయం ఏదో ఒకటి కచ్చితంగా ఉంటుంది'

అనూప్ రూబెన్స్ సంగీతం

బిడ్డను కనడం విషయంలో అయోమయం నెలకొన్న పాత్రలో మంచు లక్ష్మి సూపర్బ్ గా చేసిందని అంటున్నారు. పూర్తిగా ఇంగ్లీష్ లోనే తీసిన ఈ సినిమా ఇప్పుడు నెట్ లో హాట్ టాపిక్ అయ్యింది. విశ్వప్రసాద్ 'ది డెసిషన్' ను నిర్మించగా.. అనూప్ రూబెన్స్ సంగీతం అందించడం విశేషం. మొత్తానికి ఈ పాత్రని చేయాలకునుకోవటమే సూపర్ డెసిషన్ అన్నది ఈ షార్ట్ ఫిలిం చూసిన వారి అభిప్రాయం.... ఇప్పటికి 34వేలమంది చూసిన ఈ సినిమా గత రెండు రోజుల్లొనే ఎక్కువ వ్యూస్ ని సాధించింది.

English summary
in the recent past, we have seen Lakshmi Manchu playing an interesting role in a short film titled as The Decision.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu