మంచు లక్ష్మి మీటూ: నేనూ బాధితురాలినే... ఫసక్, పవన్ కళ్యాణ్, ఇంకా చాలా!
దేశ వ్యాప్తంగా మీటూ ఉద్యమం ఉధృతంగా సాగుతున్న వేళ మంచు లక్ష్మికి కూడా ఇందుకు సంబంధించిన ప్రశ్నలు ఎదురయ్యాయి. విమానం ఆలస్యం అవ్వడంతో ఎయిర్ పోర్టులో గంటల తరబడి వెయిట్ చేయాల్సి రావడంతో ఆమె అభిమానులతో సరదాగా చాట్ చేశారు. ఈ సందర్భంగా ఆమెకు రకరకాల ప్రశ్నలు ఎదురయ్యాయి. ఈ ప్రశ్నలకు ఓపికగా సమాధానం ఇచ్చారు. అభిమానులు అడిగిన ప్రశ్నలు కొన్ని చాలా కష్టంగా ఫీలైన ఆమె కాస్త ఈజీగా అడగండి అంటూ రిక్వెస్ట్ చేశారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ గురించి, మోహన్ బాబు ద్వారా పాపులరైన 'ఫసక్' పదం గురించి, ఇంకా చాలా విషయాలపై ఫ్యాన్స్ అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు.
ఫసక్
సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అయిన ‘ఫసక్' మీ నాన్న ఊతపదం మీరు కూడా వాడతారా? అనే ప్రశ్నకు మంచు లక్ష్మి సమాధానం ఇస్తూ.... తరచూ వాడుతుంటాను అని ఆన్సర్ ఇచ్చారు.
రాజకీయాల్లో...
రాజకీయాల్లో చేరే ఉద్దేశ్యం ఉందా? అనే ప్రశ్నకు స్పందిస్తూ... లేదు అని సమాధానం ఇచ్చారు.
పవన కళ్యాణ్‌ను అడిగాను కానీ నో రెస్పాన్స్
మేము సైతం కార్యక్రమంలో పవన్ కళ్యాణ్‌ను చూడాలని ఉంది. ఇది సాధ్యమేనా? అనే ప్రశ్నకు మంచు లక్ష్మి స్పందిస్తూ ఆయన్ను చాలా సార్లు అడిగాంకానీ రెస్పాన్స్ లేదు అని తెలిపారు.
సమానత్వం కోసం
ఈ ప్రపంచాన్ని మార్చే శక్తి ఇస్తే మీరు మొదట ఏం చేస్తారు? అనే ప్రశ్నకు స్పందిస్తూ... ప్రతి ఒక్కరూ ఎదుటి వారిని సమానంగా చూసేలా చేస్తాను అని తెలిపారు.
ఆయన ది గ్రేటెస్ట్
మీ నాన్న మోహన్ బాబు గురించి ఒక్క మాటలో చెప్పండి అనే ప్రశ్నకు స్పందిస్తూ.... ‘ది గ్రేటెస్ట్' అని వ్యాఖ్యానించారు.
సొంత విమానం కొనుక్కోవచ్చుగా
ఇలా ఇబ్బంది పడేబదులు సొంతగా చార్టెడ్ ఫ్లైట్ కొనుక్కోవచ్చుగా అని ఓ అభిమాని ప్రశ్నించగా... నువ్వు కొను నేను ఎక్కుతా అంటూ రిప్లై ఇచ్చారు.
నేను సైతం నెక్ట్స్ సీజన్
నేను సైతం నెక్ట్స్ సీజన్ ఎప్పుడు మొదలవుతుందో తనకే ఇంకా క్లారిటీ లేదని మంచు లక్ష్మి తెలిపారు.
మీటూ గురించి
జీవితంలో వేధింపులు ఎదుర్కొన్నాను అని మంచు లక్ష్మి తెలిపారు. ఆమె సమాధానం బట్టి ఇండస్ట్రీలో అలాంటివి ఎదురు కాలేదని తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











