»   » లవర్స్ డే స్పెషల్: మంచు లక్ష్మి గాఢమైన ముద్దు (ఫోటోలు)

లవర్స్ డే స్పెషల్: మంచు లక్ష్మి గాఢమైన ముద్దు (ఫోటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ప్రేమికుల దినోత్సవాన్ని పురస్కరించుకుని మంచు లక్ష్మి తన ట్విట్టర్లో పోస్టు చేసిన ఫోటో ఒకటి అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఆండీ శ్రీనివాసన్‌ను చాలా ఏళ్ల క్రితమే ప్రేమ వివాహం చేసుకున్న మంచు లక్ష్మి లవర్స్ డేను పురస్కరించుకుని.....తన పెదాల లిఫ్టిక్ అంతా భర్త పెదాలకు అంటేలా గాఢమైన ముద్దు ఇచ్చింది. ఆ ఫోటోను ట్విట్టర్లో పోస్టు చేసి అందరినీ ప్రేమికుల రోజు శుభాకాంక్షలు తెలిపింది.

ప్రముఖ నటుడు, నిర్మాత మోహన్ బాబు కూతురైన మంచు లక్ష్మి అమెరికాలో చదువుకుని 2006వ సంవత్సరంలో ఆండీ శ్రీనివాసన్‌ను పెళ్లాడిన సంగతి తెలిసిందే. కొంత కాలం విదేశాల్లో ఉండి తర్వాత ఇండియాకి వచ్చిన మంచు లక్ష్మి తెలుగు సినిమా పరిశ్రమలో నటిగా, నిర్మాతగా తనను తాను నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నారు.

స్లైడ్ షోలో ఫోటోలు, మరిన్ని వివరాలు...

ముద్దు అందిరింది

ముద్దు అందిరింది


తన భర్త ఆండీ శ్రీనివాసన్‌కు తన పెదాలకు ఉన్న లిఫ్టిక్ అంతా అతని పెదాలకు అంటేలా గాఢమైన ముద్దు పెట్టుకుంది.

నటిగా గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నం

నటిగా గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నం


ఒక మంచి నటిగా గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నంలో ఉన్న మోహన్ బాబు కూతురు మంచు లక్ష్మి ప్రసన్న సెలక్టివ్‌గా పాత్రలు ఎంచుకుంటూ ముందుకు సాగుతోంది. తొలి సినిమా అనగనగా ఓ ధీరుడు చిత్రంలో విలన్‌గా నటించి పలు అవార్డులు సొంతం చేసుకున్న మంచు లక్ష్మి...ఆ తర్వాత ‘గుండెల్లో గోదారి' చిత్రంతో మంచి ప్రశంసలు అందుకుంది.

చందమామ కథలు

చందమామ కథలు


ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో మంచు లక్ష్మి ప్రధాన పాత్ర పోషిస్తున్న చిత్రానికి చందమామ కథలు అనే టైటిల్ ఖరారైంది. ఈ చిత్రానికి చాణక్య బూనేటి నిర్మాత. చైతన్యకృష్ణ, నరేష్, అమని, కృష్ణుడు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

రాయలసీమ

రాయలసీమ


త్వరలో మంచు లక్ష్మి ‘రాయలసీమ' అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇటీవల ఈచిత్రానికి సంబంధించిన మంచు లక్ష్మి లుక్ పేయింటింగ్ పోస్టర్ రూపంలో విడుదల చేసారు. ఈ పోస్టర్ చూస్తుంటే ఈ చిత్రంలో మంచు లక్ష్మి మరో విభిన్నమైన పాత్రలో కనిపించనున్నట్లు స్పష్టం అవుతోంది.

వీర వనితగా

వీర వనితగా


‘రాయలసీమ' చిత్రం ఒక పురాణ కథ ఆధారంగా తెరకెక్కుతున్నట్లు మంచు లక్ష్మి తన ట్విట్టర్లో వెల్లడించింది. ఇందులో ఆమె ‘మున్నెమ్మ' అనే వీర వనిత గా నటిస్తున్నట్లు తెలుస్తోంది. రాయలసీమ పౌరుషం, పగలు లాంటి కథాంశంతో ఈచిత్రం తెరకెక్కుతున్నట్లు సమాచారం. త్వరలో పూర్తి వివరాలు తెలియనున్నాయి. ఈ చిత్రం కూడా మంచు లక్ష్మి స్వీయ నిర్మాణంలో తెరకెక్కనున్నట్లు చర్చించుకుంటున్నారు. డైరెక్టర్ ఖరారైన తర్వాత సినిమా గురించి అఫీషియల్‌గా వెల్లడించే అవకాశం ఉంది.

English summary
Lakshmi Manchu posted Valentine's Day greetings pic in twitter. A photo that shows the smear of Lakshmi's lipstick on the lips of husband Andy Srinivasan tells how much she loves her husband.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu