స్పెషల్ పార్టికి లక్ష్మి మంచు ఒక్కరికే ఆహ్వానం
మోహన్ బాబు కూతురు మంచు లక్ష్మీ ప్రసన్నకు రీసెంట్ గా ప్యారిస్ హిల్టన్ పార్ట నుంచి ఆహ్వానం వచ్చింది. సౌత్ నుంచి కేవలం ఆమెను ఒక్కరినే పిలిచింది. ఆ విషయమై మంచు లక్ష్మి మాట్లాడుతూ...చాలా కాలం తర్వాత ప్యారిస్ హిల్టన్ ని కలవటం చాలా ఆనందంగా ఉంది. నేను లాస్ ఏంజిల్స్ ఉండేటప్పుడు పార్టీల్లో చాలా సార్లు కలిసాను. చాలా సార్లు మాట్లాడుకున్నాం. నేను ఆమె ఇండియా రావటాన్ని చాలా ఎంజాయ్ చేస్తున్నాను అంది. అలాగే తాను ఎక్కువ సేపు పార్టీలో ఉండలేదని, డిపార్టమెంట్ షూటింగ్ ఉండటంతో వెళ్ళిపోవల్సి వచ్చిందని చెప్పింది. ఇక రాత్రి పదకొండు గంటలకు ప్రారంభమైన పార్టీ ఒంటిగంట వరకూ సాగింది.ఇక మంచు లక్ష్మి ప్రుస్తుతం నటిగానే కాక నిర్మాతగానూ సినిమా చేస్తోంది. తన సోదరుడు మంచు మనోజ్ హీరోగా ఆమె ఊ కొడతారా ఉలిక్కి పడతారా చిత్రం చేస్తోంది.అలాగే రీసెంట్ గా కమల్ హాసన్ తన తాజా చిత్రం విశ్వరూపంలో లక్ష్మీ ప్రసన్న మంచుకు ఆఫర్ ఇస్తానంటే ఆమె రిజెక్టు చేసిందంటూ వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఆమె తనకు డేట్స్ ఖాళీ లేవని రిజెక్టు చేసింది.


Click it and Unblock the Notifications











