పక్కాప్లాన్... సైలెంట్‌గా నరుక్కొస్తున్న మంచులక్ష్మి!
మంచు వారి అమ్మాయి లక్ష్మి ప్రసన్న సెలెంట్ గా తన సినీ కెరీర్ ను విస్తరించుకుంటూ వెలుతోంది. అమెరికా నుంచి తిరిగొచ్చిన తర్వాత బుల్లితెరపై తన ప్రస్థానం ప్రారంభించిన లక్ష్మి తొలుత తాను ఎవరు? తనది ఎలాంటి వ్యక్తిత్వం అనే విషయాన్ని తెలుగు ప్రజలందరికీ తెలిసేలా చేసుకుంది. కాంట్రవర్సీలకు దూరంగా ఉంటూ పరిశ్రమలో తనకంటూ మంచి ఇమేజ్ ను సొతం చేసుకున్న లక్ష్మి అనగనగా ఓ ధీరుడు చిత్రంలో నెగెటివ్ రోల్ పోషించి వెండి తెరపై ప్రవేశించింది. ఈ పాత్ర ద్వారా మంచి మార్కులే కొట్టేసింది. ఆ తర్వాత రామ్ గోపాల్ వర్మ తీసిన దొంగలముఠాలో అలా మెరిసిందే ఆలస్యం...బాలీవుడ్‍లో నిర్మాణం అవుతున్న 'డిపార్టుమెంట్' చిత్రంలో నటించే అవకాశం దక్కించుకుంది. రామ్ గోపాల్ వర్మ ఇచ్చిన ఈ అవకాశాన్ని సదర్వినియోగం చేసుకున్న లక్ష్మి తనదైన శైలిలో బాలీవుడ్ లో మంచి ఫాలోయింగ్ సంపాదించింది. అమితాబ్ లాంటి స్టార్లను ఇంప్రెస్ చేసి బాలీవుడ్ లో తన స్థానం సుస్థిరం చేసుకునే ప్రయత్నం మొదలు పెట్టింది.
ఆ విషయం పక్కన పెడితే.....తాజాగా తెలుగు తెరపై హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చేందుకు సన్నాహాలు మొదలు పెట్టింది కూడా. గుండెల్లో గోదారి చిత్రం ద్వారా లక్ష్మి అతిత్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. స్వయంగా ఆమెనే నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమా తమిళ్ లోనూ విడుదల చేసే అవకాశం ఉంది. ఇందులో తమిళ నటుడు ఆదిని హీరోగా ఎంపిక చేయడం వెనక అసలు కారణం అదే అంటున్నారు. మరో వైపు తమిళంలో ప్రముఖ దర్శకుడు మణిరత్నం నిర్మించే చిత్రంలోనూ అవకాశం దక్కించుకుంది. ఇలా పక్కా ప్లాన్ ప్రకారం దూసుకెలుతున్న లక్ష్మి....సైలెంట్ గా తన సినీ కెరీర్ కి అడ్డంగా ఉన్న వాటిని నరుక్కుంటూ వెలుతోంది.


Click it and Unblock the Notifications











