»   »  ఆ హీరోయిన్ మహా ముదురు... వయసు 19, ఎఫైర్లు 8

ఆ హీరోయిన్ మహా ముదురు... వయసు 19, ఎఫైర్లు 8

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: సౌత్ హీరోయిన్ లక్ష్మీ మీనన్ వయసు తక్కువే అయినా... ఇతర విషయాల్లో బాగా ముదిరి పోయింది. తన 15వ ఏటనే హీరోయిన్ అవకాశం దక్కించుకున్న ఈ మళయాలం బ్యూటీ తమిళ సినిమాల్లో వరుస అవకాశాలతో దూసుకెలుతోంది. ఇండస్ట్రీకి వచ్చి 4 ఏళ్లే అయినా... పదికి పైగా సినిమాల్లో నటించింది. వరుస విజయాలు అందుకుంది.

ప్రస్తుతం లక్ష్మీ మీనన్ వయసు 19. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆమె పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఇప్పటి వరకు తాను 8 మందిని ప్రేమించానని, అయితే వారితో నచ్చకనే విడిపోయినట్లు వెల్లడించింది. అసలు ఈ వివాహ వ్యవస్థపై తనకు నమ్మకం లేదని, పెళ్లి చేసుకునే ఆలోచన లేదని తెగేసి చెప్పింది. పెళ్లి చేసుకోని వారే జీవితంలో సక్సెస్ అయ్యారని అంటోంది.

Lakshmi Menon Says No to Marriage

మొదటి నుండీ ఏ విషయం అయినా మొహం మీదే చెప్పే అమ్మాయిగా లక్ష్మీ మీనన్‌కు పేరుంది. పెళ్లి విషయంలో కూడా తాను అలాగే స్పందించింది. పెళ్లి చేసుకోకుండానే తనకు ఇష్టం వచ్చిన వారితో సహజీవనం చేస్తాను అంటోందని, సమాజం ఏమనుకున్నా తనకు అనవసరం అని ఆమె చెప్పినట్లు సమాచారం.

లక్ష్మీ మీనన్ సినిమాల విషయానికొస్తే...
ప్రస్తుతం ఆమె గౌతం కార్తీక్ హీరోగా తెరకెక్కుతున్న ‘సిపాయ్' అనే తమిళ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని పోస్టు ప్రొడక్షన్ దశలో ఉంది. దీంతో పాటు అజిత్ హీరోగా సినిమాటోగ్రాఫర్ శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రంలో అజిత్ చెల్లి పాత్రను లక్ష్మీ మీనన్ చేస్తున్నట్లు సమాచారం.

English summary
Lakshmi Menon who is slowly climbing the popularity charts in Kollywood says she has no plans to get married in the near future. She says she has seen several examples of women who are not married and successful. So she is planning to follow their footsteps.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu