తనీష్ ‘మంచివాడు’
పలు ఉత్తమ కథా చిత్రాల్ని అందించిన సూపర్ గుడ్ ఫిలింస్ సంస్థ ఇప్పుడు 'మంచివాడు" అని చిత్రానికి శ్రీకారం చుడుతోంది. సునీల్ కథానాయకుడిగా 'అందాలరాముడు" వంటి హిట్ చిత్రాన్ని ఈ సంస్థ ఇంతకు ముందు అందించింది. 'మంచివాడు" చిత్రం ద్వారా యువ దర్శకుడు లక్ష్మీ నారాయణకి మరో అవకాశాన్ని ఇస్తోంది. యువ కథానాయకుడు తనీష్ హీరోగా ఈ చిత్రంలో నటిస్తున్నారు.
'ఉషాకిరణ్ మూవీస్ నిర్మించిన సూపర్ హిట్ చిత్రం 'నచ్చావులే" ద్వారా కథానాయకుడిగా తనీష్ పరిచయ్యాడు.ఈ చిత్రం వివరాలను చిత్ర సమర్పకులు ఆర్.బి.చౌదరి చెప్పారు. ఈ చిత్రంలో తనిష్ అందరూ మెచ్చే పాత్రను చేస్తున్నాడని, కుటుంబ సమేతంగా చూడదగ్గ చిత్రం అని, కథాపరంగా హీరో ఉత్తమ గుణాలు కలిగిన వాడని, అందుకే దీనికి 'మంచివాడు" అని పేరుపెట్టామన్నారు. ఈ చిత్రంలో మరో విశేషం ఎంటంటే సంగీత దర్శకుడు కోటి తనయుడు అయిన రాజీవ్ మరో ప్రధాన పాత్రను చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











