చరిత్రలో మీ నీచమైన స్టోరీ మిగులుతుంది: లక్ష్మీ పార్వతి

ఇక మీ టైం అయిపోయింది. ఇక మీ పాపాలు బయటకు వస్తున్నాయి. నా మంచితనం ఏమిటో ఇపుడు బయటకు వస్తుంది. ఇపుడు చూడండి జనం ఏం మాట్లాడుకుంటున్నారో. అందరూ నా గురించే మాట్లాడుకుంటున్నారు. ఆవిడ మంచిది పాపం.. అమాయకురాలు.. మోస పోయిందని జాలి చూపుతున్నారు. వాస్తవం అనేది 23 ఏళ్ల తర్వాత బయటకు వస్తోంది.. అని ఎన్టీ రామారావు సతీమణి లక్ష్మీపార్వతి వ్యాఖ్యానించారు. ఇప్పటి వరకు రామారావు కుటుంబం తనను ఏకాకిని చేసి దుష్ప్రచారం చేసిందని, మరికొన్ని రోజుల్లో 'లక్ష్మీస్ ఎన్టీఆర్' రూపంలో వాస్తవాలు బయటకు రాబోతున్నాయని తెలిపారు.

కులాన్ని, మీడియాను తమ వైపు తిప్పుకున్నారు

కులాన్ని, మీడియాను తమ వైపు తిప్పుకున్నారు

నా భర్త ఎన్టీ రామారావుగారి విషయంలో ఏక పక్షంగా నా మీద నిందలు వేశారని లక్ష్మి పార్వతి తెలిపారు. ‘ఆమె వైపు మాట్లాడే వారు ఎవరూ లేరు, కులాన్ని మా వైపు తిప్పుకున్నాం, అధికారం మా చేతుల్లోఉంది, మీడియాను మేము కొనేసి పెట్టుకున్నాం. న్యాయ వ్యవస్థ అంతా కూడా మేము ఏం చెబితే అది చేస్తుంది. అందు వల్ల ఒక స్త్రీ మీద మేం నిందలు వేస్తే జనం ఇదే నమ్ముతారు అనుకుని ఇదంతా చేశారు.'' అని లక్ష్మీ పార్వతి వ్యాఖ్యానించారు.

చరిత్రలో మీ నీచమైన స్టోరీ మిగులుతుంది

చరిత్రలో మీ నీచమైన స్టోరీ మిగులుతుంది

ఇదంతా మీరు నా మీద కుట్ర అనుకున్నారు. కానీ ఇది మీ తండ్రి మీద కుట్ర. మీ మామ మీద మీరు చేసుకున్న కుట్ర. ఒక కుటుంబ వ్యవస్థకే విఘాతం కలిగించారు మీరు. చరిత్రలో మీ నీచమైన స్టోరీ మిగిలుతుంది... అంటూ లక్ష్మీ పార్వతి మండి పడ్డారు.

రానున్న చరిత్ర నా గురించి రాయబోతోంది

రానున్న చరిత్ర నా గురించి రాయబోతోంది

ఒక స్త్రీ ఎంత ప్రేమించగలదో, ప్రేమించిన తన భర్త కోసం ఎంత వరకైనా నిలబడగలదు. ఎన్ని కష్టాలు పెట్టినా, ఎన్ని అవమానాలు చేసినా తన దారి తప్పకుండా భర్త దారిలో నడుస్తూ చివరి వరకు సాధించడానికి ఎలా నిలబడిందో రానున్న చరిత్ర నా గురించి రాయబోతోంది. మీ గురించి కాదన్నారు.

ఆర్జీవీకి థాంక్స్

ఆర్జీవీకి థాంక్స్

మీరు ఎన్ని చెప్పుకున్నా ఇప్పటి వరకు నడిచింది. ఇక మీ టైం అయిపోయింది. ఇక మీ పాపాలు బయటకు వస్తున్నాయి. నా మంచితనం ఏమిటో ఇపుడు బయటకు వస్తుంది. ఇపుడు చూడండి జనం ఏం మాట్లాడుకుంటున్నారో. అందరూ నా గురించే మాట్లాడుకుంటున్నారు. మంచిది పాపం.. అమాయకురాలు.. మోస పోయిందని జాలి చూపుతున్నారు. వాస్తవం అనేది 23 ఏళ్ల తర్వాత బయటకు వస్తోంది. దానికి మొదట ఆర్జీవీగారికి థాంక్స్ చెప్పాలి... ఇటీవల ఓ ఇంటర్వ్యూలో లక్ష్మీ పార్వతి వ్యాఖ్యానించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X