మోహన్ బాబు చివర్లో ఎన్టీఆర్‌ని వదిలేసి .. అమాయకత్వంతో చేసినా తప్పే.. లక్ష్మీపార్వతి!
రాంగోపాల్ వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్ర ట్రైలర్ సంచలనాలు సృష్టిస్తోంది. యూట్యూబ్ లో మిలియన్ల కొద్దీ వ్యూస్ తో నెటిజన్లు లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్ర ట్రైలర్ కి బ్రహ్మరథం పడుతున్నారు. లక్ష్మీపార్వతి, ఎన్టీఆర్ మధ్య బంధాన్ని ఆర్జీవీ ఎమోషనల్ గా ట్రైలర్ చూపించారు. ఇన్ని ఏళ్ల తర్వాత ఎన్టీఆర్ కు జరిగిన అన్యాయంలో వర్మ వాస్తవాలు బయటకు తీస్తున్నారని లక్ష్మీపార్వతి ప్రశంసించారు. ఈ సందర్భంగా అప్పట్లో జరిగిన సంఘటనలు కొన్నింటికి ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు.

మోహన్ బాబు చివరి నిమిషంలో
లక్ష్మీస్ ఎన్టీఆర్ ట్రైలర్ లో ఓ సన్నివేశంలో మోహన్ బాబు పాత్రని కూడా చూపించినట్లు తెలుస్తోంది. కానీ అది అఫీషియల్ గా మోహన్ బాబు పాత్రేనా అనే విషయం వర్మే చెప్పాలి. ఈ నేపథ్యంలో లక్ష్మీ పార్వతి మోహన్ బాబు గురించి కామెంట్ చేశారు. ఎన్టీఆర్ కు వెన్నుపోటు జరిగిన సమయంలో మోహన్ బాబు కూడా ఆఖరిలో ఎన్టీఆర్ ని వదిలేసి చంద్రబాబుతో చేతులు కలిపారని ఆరోపించారు.

అందుకే కామెంట్ చేయను
మోహన్ బాబు అలా చేయడం వలనే తాను ఆయన్ని విమర్శించానని లక్ష్మీపార్వతి తెలిపింది. ఆ తర్వాత మోహన్ బాబు తప్పు తెలుసుకుని అన్నగారికి అన్యాయం చేశానని క్షమాపణ చెప్పారు. అలా తప్పు తెలుసుకున్న వ్యక్తి గురించి కామెంట్ చేయడం సరికాదని లక్ష్మీపార్వతి అన్నారు. వర్మ రూపొందించిన లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్ర ట్రైలర్ కు లక్షల మందినుంచి స్పందన వస్తోందంటే ప్రజలంతా నిజం వైపు ఉన్నారని ఆమె తెలిపారు.

రెండుసార్లు వివరించారు
ఎన్టీఆర్ సతీమణి బసవతారకం మరణించిన తర్వాత దాదాపు 12 ఏళ్ల పాటు ఎలాంటి తోడు లేకుండా ఉన్నారు. కానీ తాను నిస్సహాయ స్థితిలో ఉన్న సమయంలో, ఆరోగ్యం సరిగా లేని సమయంలో తోడు కోరుకున్నారు. ఈ విషయం అర్థం చేసుకుంటారని అయన తన కుటుంబ సభ్యులతో రెండు సార్లు మీటింగ్ పెట్టి భద్యతగా వివరించారు. నాకు ఆరోగ్యం బాగాలేదు.కేవలం భార్య అయితేనే సేవ చేయగలుగుతుంది అని తన కుటుంబ సభ్యులకు వివరించారు.

అమాయకత్వంతో చేసినా తప్పే
చివరి రోజుల్లో ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు చంద్రబాబుకు సపోర్ట్ చేయకుంటే ఇంత అన్యాయం జరిగేది కాదు. నా పైన అనవసరంగా ఈర్ష, ద్వేషాన్ని పెంచుకున్నారు. అమాయకత్వంతో చేసినా అది తప్పే. ఇప్పటికైనా రాంగోపాల్ వర్మ వాస్తవాలని లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రం ద్వారా వెలుగులోకి తీసుకొస్తున్నందుకు సంతోషంగా ఉందని లక్ష్మీపార్వతి తెలిపింది.


Click it and Unblock the Notifications











