క్రిష్ మీద నమ్మకం లేదు, చెడగొట్టాడు... బాలయ్య సూటవ్వడు: లక్ష్మీ పార్వతి సంచలనం
బాలకృష్ణ ప్రధాన పాత్రలో క్రిష్ దర్శకత్వంలో రూపొందిన 'ఎన్టీఆర్-కథానాయకుడు' విడుదల వేళ తెలుగు మీడియా లక్ష్మీ పార్వతి స్పందన కోసం అన్వేషించింది. చివరకు ఆమె తిరుమల శ్రీవారి దర్శనంలో ఉన్న విషయం తెలుసుకుని అక్కడికి వెళ్లి ఆమె అభిప్రాయం తీసుకున్నారు.
ఎన్టీఆర్ బయోపిక్ సినిమా ఇంకా చూడలేదు. ఈ రోజు తిరుమల శ్రీవారి దర్శనంలో ఉన్నాను. నాకు సినిమాలు చూసే అలవాటు లేదు. ఎన్టీఆర్ మూవీ కాబట్టి త్వరలో చూస్తాను. విమర్శించడానికైనా చూస్తానని చెప్పిన లక్ష్మీ పార్వతి ఈ సందర్భంగా దర్శకుడు క్రిష్, బాలయ్యపై సంచలన వ్యాఖ్యలు చేశారు.

క్రిష్ మీద నమ్మకం లేదు, దాన్నే చెడగొట్టాడు
ఎన్టీఆర్ బయోగ్రఫీ మొదట రాసింది నేనే. ఆయన స్వయంగా చెప్పిన విషయాలే అందులో రాశాను. ఆ కాపీ కూడా వారు తెప్పించుకున్నట్లు తెలిసింది. తీయటం ఎలా తీశారో తెలియదు. నాకైతే క్రిష్ డైరెక్షన్ మీద అంత గొప్ప నమ్మకం లేదు. గౌతమీపుత్ర శాతకర్ణి ఎంతో బాగా చేయవచ్చు. దాన్ని టీవీలో చూసినపుడు చాలా పాడుచేశారనిపించిందని లక్ష్మి పార్వతి తెలిపారు.

బాలయ్య హైటు, వెయిటు సూటవ్వదు...
ఎన్టీఆర్ బయోపిక్‌లో బాలకృష్ణ కాకుండా వేరేవారు నటిస్తే న్యాయం జరిగేదని ఎన్నోసార్లు చెప్పాను. ఆ పాత్రకు ఆయన సూట్ అవ్వడు...కారణం హైటు లేక పోవడమే. వాళ్ల నాన్నగారంత హైటు లేరు, వెయిటు లేరు. దానికి తగినట్లు వాచకాభినయం కూడా ఉండాలి. ఎన్టీఆర్ పాత్ర అంటేనే డిఫరెంట్. ఆ మహానుభావుడితో ఎవరినీ కంపేర్ చేయలేమని.. లక్ష్మి పార్వతి తెలిపారు.

చాలా మంది డూప్స్ వస్తున్నారు
ఎన్టీఆర్ పేరుతో చాలా మంది డూప్స్ వస్తున్నారు. ఎన్టీఆర్ ‘ఏమంటివీ ఏమంటివీ డైలాగ్ పట్టుకుని' అదే గొప్ప నటన అనుకున్నట్లు యాక్ట్ చేసే వారిని చూస్తున్నాం. ఆ డూప్ లందరికీ ఇచ్చేది పది రూపాయలే... అంటూ ఆమె వ్యాఖ్యానించారు.

బాలకృష్ణకు ఆ రెండూ లేవు
డూపులతో చేయించడం కంటే ఆయన తనయుడు బాలకృష్ణ చేయడం నందమూరి అభిమానులు స్వాగతించే విషయమే కదా... అనే ప్రశ్నకు లక్ష్మీ పార్వతి స్పందిస్తూ ఆ మాట నిజమే కానీ, కాస్త కుడి ఎడమగానైనా ఆ పాత్రకు సరిపడే పర్సనాలిటీ ఉంటే బావుండేది. ఆహార్యం అనేది చాలా ముఖ్యమైనది. రూపం కూడా చాలా ఇంపార్టెంట్. చూడగానే ఆకట్టుకుంటే కొన్ని మైనస్ లు తొలగిపోతాయి. బాలకృష్ణకు రూపము, వాగ్దాటి రెండూ లేవని తెలిపారు.

చాలా లాగినట్లు ఉందని చెప్పారు
నాకు ఇప్పటి వరకు కొంత మంది ఫోన్లు చేసి సినిమాపై తమ అభిప్రాయం చెప్పారు. పూర్తి కథ ఎవరూ చెప్పలేదు. కాస్త లాగినట్లు ఉందని, డాన్సులు ఎక్కువగా పెట్టారని, కథ ఎక్కువగా పెడితే బావుండేది అన్నారు.

ఈ సినిమా చంద్రబాబు డ్రామా..
ఎలా ఉన్నా మహానుభావుడి చరిత్ర తీసినందుకు అభినందించాలి. నిస్వార్థంగా తీసుంటే మనస్ఫూర్తిగా అభినందిద్దాం. కానీ ఎలక్షన్ల కోసం తీసిన సినిమా. ఎన్టీఆర్ అభిమానులందరినీ మళ్లీ కదిలించి, సెంటిమెంటు పండించేసి, మళ్లీ ఎన్టీఆర్ స్థాపించిన తెలుగు దేశం పార్టీకి ఓటు వేయించేందుకు చంద్రబాబు నాయుడు వెనక ఉండి ఆడించిన డ్రామా ఇది.

వైసీపీకి సంబంధం లేదు, లాభం జరిగేది మా ఇద్దరికే...
లక్ష్మీస్ ఎన్టీఆర్... వైసీపీ లబ్ది చేకూరే సినిమా కాదా? అనే ప్రశ్నకు లక్ష్మి పార్వతి స్పందిస్తూ ఇందులో వైసీపీ ఒక్కరూపాయి పెట్టినా సినిమా ఆపేయమని ఆర్జీవికి అప్పుడే చెప్పాను. ఇందులో ఆ పార్టీకి సంబంధమే లేదు. ఈ సినిమా రిలీజ్ అయితే వైసీపీకి ఎలాంటి లాభం ఉండదు... లక్ష్మి పార్వతికి, ఎన్టీఆర్ కు లబ్ది చేకూరుతుందని లక్ష్మీపార్వతి తెలిపారు.


Click it and Unblock the Notifications











