స్వర్గీయ ఎన్టీఆర్‌కు జూనియర్ ఎన్టీఆర్‌కు పోలికా? ఆయనకు వారసులే లేరు.. లక్ష్మీ పార్వతి షాకింగ్ కామెంట్స్

స్వర్గీయ నందమూరి తారక రామారావు సతీమణి, వైఎస్ఆర్సీపీ నేత లక్ష్మీ పార్వతి నందమూరి, నారా ఫ్యామిలిని టార్గెట్ చేస్తూ తరుచూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తుండటం తెలిసిందే. ఆమె చేసే వ్యాఖ్యలు అత్యంత వివాదాస్పదంగా మారుతుంటాయి. తాజాగా తారకరత్న మరణంపై ఆమె చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపాయి. తారకరత్న ఎప్పడో చనిపోయాడు. కానీ 23 రోజులు ఆ విషయాన్ని దాచిపెట్టి చివరకు ఈ వార్తను బయటకు తెచ్చారు అంటూ లక్ష్మీ పార్వతి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో లక్ష్మీపార్వతి గతంలో చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నది. ఆ వీడియోలో లక్ష్మీ పార్వతి ఏమాట్లాడిందంటే?

తారకరత్న మరణం నేపథ్యంలో

తారకరత్న మరణం నేపథ్యంలో

తారకరత్న మృతి నేపథ్యంలో పార్థీవ దేహానికి శ్రద్దాంజలి ఘటించిన లక్ష్మీ పార్వతి మీడియాతో మాట్లాడుతూ.. మా కుటుంబంలో ఇలాంటి విషాదం జరగడం చాలా దారుణం. తారకరత్న మరణం విషయంలో మరోసారి నీచమైన రాజకీయాలు బయటపడ్డాయి. కేవలం లోకేష్ కోసం, స్వార్ధం కోసం, తన కుమారుడికి ఎక్కడ చెడ్డ పేరు వస్తుందనే కారణంతో చంద్రబాబు ఈ మరణవార్తను తొక్కి పెట్టారు. ఏమిటి దుర్మార్గం, ఈ రాజకీయాలకు అంతం లేదా? నా భర్త ఎన్టీఆర్ కూడా కుమిలి కుమిలి చనిపోయాడు. ఇప్పుడు పార్టీ కోసం మంచి చేద్దామని అనుకొన్న తారకరత్న కూడా బలైపోయాడు అని లక్ష్మీపార్వతి అన్నారు.

నరకాన్ని అనుభవిస్తున్నాం

నరకాన్ని అనుభవిస్తున్నాం

తారకరత్న మరణాన్ని కూడా చంద్రబాబు నాయుడు తన పబ్బానికి వాడుకొన్నాడు. ఈ నీచమైన రాజకీయాలకు ఎప్పుడైతే స్వస్తి పలుకుతుందో అప్పుడే మా నందమూరి కుటుంబం బాగుపడుతుంది. లేకపోతే మేము నరకాన్ని అనుభవిస్తున్నాం అని లక్ష్మీ పార్వతి అన్నారు. అయితే ఇలా లక్ష్మీ పార్వతి విరుచుకుపడిన నేపథ్యంలో గతంలో నందమూరి హీరోల గురించి మాట్లాడిన వీడియో వైరల్ అయింది. అందులో ఆమె ఏం చేప్పిందంటే..

జూనియర్ ఎన్టీఆర్‌కు మహానుభావుడి పోలికలా?

జూనియర్ ఎన్టీఆర్‌కు మహానుభావుడి పోలికలా?


స్వర్గీయ ఎన్టీఆర్ పోలీకలతో జూనియర్ ఎన్టీఆర్ ఉన్నాడు కదా అని యాంకర్ అడిగిన ప్రశ్నకు లక్ష్మీ పార్వతి సమాధానం ఇస్తూ.. మహానుభావుడి పోలికలు జూనియర్ ఎన్టీఆర్‌కు వచ్చాయని మీరు మనస్పూర్తిగా ఒప్పుకొంటారా అని ఎగతాళి చేసింది. దాంతో పోలికలు వచ్చాయని అందరూ అంటున్నారు కదా.. అని యాంకర్ ప్రశ్నిస్తే.. ఎవరో చెప్పడం కాదు.. మీరు చెప్పండి అని వారిని నిలదీసింది.

జూ ఎన్టీఆర్ అరజానుభావుడు

జూ ఎన్టీఆర్ అరజానుభావుడు

లక్ష్మీపార్వతి మాటలకు యాంకర్ అడ్డుపడుతూ.. స్వర్గీయ ఎన్టీఆర్ పోలికలు జూనియర్ ఎన్టీఆర్‌కు ఉన్నాయి కదా.. అని అంటే.. ఆయన ఫోటో, ఈయన ఫోటో పక్కన పెట్టి చూడండి.. హస్తి, మష్కాంతరం (ఏనుగు, దోమకు ఉన్న) తేడా ఉంటుంది. ఆయన పోలీకలు ఎవరికీ రాలేదు. ఏనుగు, దోమకు ఉన్న తేడా ఉంటుంది. స్వర్గీయ ఎన్టీఆర్ ఆజానుభావుడు అయితే.. జూనియర్ ఎన్టీఆర్ పొట్టివాడు అంటూ సైగలు చేస్తూ.. అరజానుభావుడు అంటూ లక్ష్మీ పార్వతి ఎద్దేవా చేసింది.

స్వర్గీయ ఎన్టీఆర్‌కు వారసులే లేరు..

స్వర్గీయ ఎన్టీఆర్ పోలీకలే కాదు.. నటనలో, అందంలో గానీ ఆయన వారసత్వం ఎవరికీ రాలేదు. ఈ కుటుంబంలో ఆయనకు సరితూగే వారు లేరు. ఎన్టీఆర్‌కు వారసులంటూ ఎవరు లేరు. ఇది మాత్రం వాస్తవం అంటూ లక్ష్మీ పార్వతి వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. ప్రస్తుతం ఈ వీడియో తారకరత్న మరణం నేపథ్యంలో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X