ఆ హీరో వల్ల ఎన్టీఆర్ ఆత్మతో మాట్లాడా.. ఇదే చెప్పారంటూ లక్ష్మీపార్వతి ఆసక్తికర కామెంట్స్

విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌ 26వ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్‌లోని ఎన్టీఆర్‌ ఘాట్‌ వద్ద కుటుంబీకులు నివాళులర్పించారు. అయితే ఆయన భార్య లక్ష్మి పార్వతి మాత్రం సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ వివరాలు

ఎన్టీఆర్‌ను మరచిపోలేరు

ఎన్టీఆర్‌ను మరచిపోలేరు

తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి తెలుగు ప్రజల ఆరాధ్య దైవం నందమూరి తారక రామారావు 26వ వర్ధంతి సందర్భంగా ఎన్టీఆర్‌ ఘాట్‌ వద్ద ఆయన కుటుంబ సభ్యులు నివాళులు అర్పించారు. ఎన్టీఆర్ కుమారుడు, నటుడు నందమూరి బాలకృష్ణ కూడా అంజలి ఘటించారు. ప్రజల హృదయాల్లో ఎన్టీఆర్‌ నిలిచిపోయారన్న బాలకృష్ణ.. తెలుగుజాతి ఉన్నంతవరకు ఎన్టీఆర్‌ను మరచిపోలేరని పేర్కొన్నారు. సినీ, రాజకీయ రంగాల్లో ఎన్టీఆర్‌ స్ఫూర్తిగా నిలిచారని అన్నారు.

ఆత్మతో మాట్లాడా

ఆత్మతో మాట్లాడా

బాలకృష్ణతో పాటు నందమూరి రామకృష్ణ, సుహాసిని ఎన్టీఆర్‌ ఘాట్‌కు చేరుకొని నివాళుర్పించి, ఆయన సేవలను గుర్తు చేశారు. ఇక ఎన్టీఆర్‌ వర్ధంతి నేపథ్యంలో ఆయనకు నివాళులు అర్పించిన లక్ష్మీ పార్వతి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్ చనిపోయినప్పుడు ఆయన ఆత్మతో మాట్లాడానని ఆమె వెల్లడించారు. అంతే కాక దానికి సాక్ష్యం కూడా ఉందని, హీరో రాజశేఖర్, ఆయన భార్య జీవితనే తనను అక్కడికి తీసుకు వెళ్లి మాట్లాడించారని ఆమె పేర్కొన్నారు.

ఆత్మ తనతో చెప్పింది

ఆత్మ తనతో చెప్పింది

26 ఏళ్ల తర్వాత ఈ రహస్యం చెబుతున్నానని... ఎన్టీఆర్ చనిపోయినప్పుడు జీవిత, రాజశేఖర్‌ తనను మద్రాస్ తీసుకెళ్లి ఒక అమ్మాయితో మాట్లాడించారని అన్నారు. ఎన్టీఆర్ ఆత్మ 16 ఏళ్ల అమ్మాయిలో ప్రవేశించి తనతో అనేక విషయాలు పంచుకుందని లక్ష్మీపార్వతి తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లో తాను మళ్లీ జన్మిస్తానని... అందరి ముఖ్యమంత్రుల మనస్సులో తాను ఉంటానని.. ప్రజలకు మంచి చేయాలని తాను ప్రబోధం చేస్తుంటానని ఆయన ఆత్మ తనతో చెప్పిందని ఆమె అన్నారు.

విడిచిపెట్టి ఉండరు

విడిచిపెట్టి ఉండరు

ఇక ఆ అమ్మాయితో మాట్లాడినప్పటి నుంచి తనకు ఎన్టీఆర్ ఎప్పుడూ తెలుగు ప్రజలను విడిచిపెట్టి ఉండరని ఓ నమ్మకమని.. లక్ష్మీపార్వతి వెల్లడించారు. ఇక ఎన్టీఆర్ ఆత్మ ఇక్కడే ఉందన్న ఆమె అంటే ఈ ఘాట్‌ దగ్గరని కాదు కానీ... తెలుగు రాష్ట్రాల ప్రజలందరి వద్ద ఆయన ఆత్మ తిరుగుతూ బాగోగులు చూసుకుంటోందని పేర్కొన్నారు. ఎన్టీఆర్ మహానుభావుడని.. ఎప్పటికీ ప్రజల మనసుల్లో చిరస్మరణీయంగా ఉంటారని తెలిపారు. జాతికి ఇలాంటి వారు ఒకళ్లే పుడతారన్న ఆమె తెలుగువారి గౌరవాన్ని చాటిన మహనీయులు ఎన్టీఆర్ రాజకీయాల్లో తనదైన ముద్ర వేశారన్నారు

ఎన్టీఆర్ తోడుగా

ఎన్టీఆర్ తోడుగా

ఇక తాను బతికున్నంతవరకు ఎన్టీఆర్ తనకు తోడుగా ఉంటారని.. అడుగుడుగనా తనను రక్షించుకుంటూనే ఉన్నారని... ఆయన జ్ఞాపకాల్లోనే తాను ఇంకా బతుకుతున్నానన్నారు. అలాగే ఏపీలో ఎన్టీఆర్ విగ్రహం ధ్వంసం ఘటనపై లక్ష్మీపార్వతి స్పందించారు. ఎన్టీఆర్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన వారిని అరెస్టు చేయించడం ద్వారా సీఎం జగన్ చాలా హుందాగా వ్యవహరించారని ఆమె ప్రశంసించారు.

దుర్గిలో విగ్రహ ధ్వంసంపై మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామ కృష్ణారెడ్డితో మాట్లాడి వాస్తవాలు తెలుసుకున్నానని తెలిపారు. అయితే మరి ఈ అంశంలో జీవిత‌-రాజ‌శేఖ‌ర్ దంప‌తులు బ‌య‌టికొచ్చి.. అస‌లు ఆనాడు ఏం జ‌రిగిందో.. ల‌క్ష్మీపార్వ‌తి ఎన్టీఆర్ ఆత్మ‌తో మాట్లాడారో లేదో.. చెబితే గానీ ఒక క్లారిటీ వచ్చేలా కనిపించడం లేదు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X