Just In
- 56 min ago
మహేష్ చేయాల్సిన పవర్ఫుల్ కథలో పవన్ కళ్యాణ్.. పదేళ్ల తరువాత సెట్స్ పైకి..
- 1 hr ago
క్రాక్ హిట్టు కాదు.. అంతకు మించి.. రవితేజ కెరీర్ లోనే బిగెస్ట్ కలెక్షన్స్
- 2 hrs ago
బుట్టబొమ్మ ఫుల్ బిజీ.. కుదరకపోయినా మెగా హీరో కోసం ఒప్పుకుందట
- 2 hrs ago
జాకెట్ బటన్స్ విప్పేసి పాయల్ రాజ్‌పుత్ రచ్చ: ఎద అందాలతో కనువిందు చేస్తూ హాట్ వీడియో పోస్ట్!
Don't Miss!
- Sports
India vs England: వారికి ఐదు రోజులు.. వీరికి మాత్రం మూడు రోజులే!!
- News
టీఆర్ఎస్ లో రసమయి వ్యాఖ్యల దుమారం ..తానో లిమిటెడ్ కంపెనీలో పని చేస్తున్నానంటూ అసమ్మతి రాగం!!
- Automobiles
2020 ఇండియన్ నేషనల్ మోటార్‌సైకిల్ డ్రాగ్ ఛాంపియన్షిప్ విజేతగా హేమంత్ ముద్దప్ప
- Lifestyle
Republic Day 2021:చరిత్ర తిరగరాస్తున్న నారీమణులు.. ఫ్లై పాస్ట్ ను లీడ్ చేయనున్న ఫస్ట్ లేడీ పైలట్ స్వాతి రాథోడ్
- Finance
కరోనా టైంలో ముఖేష్ అంబానీ ప్రతి గంట సంపాదన రూ.90 కోట్లు, వారి సంపద రూ.3వేలే!
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
తెరపైకి లక్ష్మి పార్వతి కుమారుడు... ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ మూవీపై హాట్ కామెంట్!
రాంగోపాల్ వర్మ తెరకెక్కించిన 'లక్ష్మీస్ ఎన్టీఆర్' చిత్రం తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల వేళ సంచలనం క్రియేట్ చేసింది. ఎన్టీ రామారావు జీవితంలోకి లక్ష్మి పార్వతి ఎంటరైన తర్వాత చోటు చేసుకున్న పరిణామాలు, తాను నమ్మిన వాళ్లు వెన్నుపోటు పొడిచి పదవి లాక్కోవడం వల్ల చివరి రోజుల్లో ఆయన ఎంత క్షోభకు గురయ్యాడనే అంశాలు ఇందులో కళ్లకు కట్టినట్లు చూపించారు.
ఈ సినిమాపై తాజాగా లక్ష్మి పార్వతి కుమారుడు స్పందించారు. చాలా మందికి లక్ష్మి పార్వతికి కుమారుడు ఉన్నారనే విషయం తెలియదు. ఆయన ఎప్పుడూ కూడా ఎవరికీ కనిపించలేదు, మీడియా ముందుకు కూడా రాలేదు. తొలిసారి ఓ యూట్యూబ్ ఛానల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు.

లక్ష్మి పార్వతి కుమారుడు డాక్టర్ కోటేశ్వర ప్రసాద్
లక్ష్మి పార్వతి కుమారుడి పేరు కోటేశ్వర ప్రసాద్. హైదరాబాద్‌లో వైద్యుడిగా పని చేస్తున్నారు. తాను ఎప్పుడూ ఐడెంటిటీ కోరుకోలేదని, అందుకే ఇంతకాలం తాను మీడియా ముందుకు రాలేదని వెల్లడించారు. చిన్నతనం నుంచి నేను చాలా ఇండిపెండెంట్, స్నేహితులు కూడా చాలా లిమిటెడ్‌గా ఉన్నారని తెలిపారు.

చిన్నతనంలో మోహన్ బాబు ఇంట్లోనే...
తాను చిన్నతనంలో మోహన్ బాబు ఇంట్లో పెరిగినట్లు ఈ సందర్భంగా డాక్టర్ కోటేశ్వర ప్రసాద్ తెలిపారు. అమ్మ చిన్నప్పటి నుంచి చదువు ఎంతో ముఖ్యమని చెప్పేదని, అందుకే ఈ విషయంలో ఎప్పుడూ తగ్గలేదు. ఫైలట్ లేదా డాక్టర్ అవ్వాలని ఉండేది. 10వ తరగతి తర్వాత మ్యాథ్స్ అంటే కాస్త భయం ఉండటంతో వైద్య విద్య వైపు వచ్చానని తెలిపారు.

ఎన్టీ రామారావును అంకుల్ అని...
ఎన్టీ రామారావును అంకుల్ అని పిలిచేవాడిని అని ఈ సందర్భంగా డాక్టర్ కోటేశ్వర ప్రసాద్ గుర్తు చేసుకున్నారు. తాను చిన్నప్పటి నుంచి పాటలు బాగా పాడేవాడిని, స్కూల్, కాలేజీ రోజుల్లో జరిగే కాంపిటీషన్లలో కూడా పాల్గొన్నాను. ఓసారి ఎన్నికల సమయంలో పాట పాడితే ఎన్టీ రామారావుగారు అభినందించారని చెప్పుకొచ్చారు.

లక్ష్మిస్ ఎన్టీఆర్ మూవీ గురించి...
రాంగోపాల్ వర్మ రూపొందించిన ‘లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమాపై కోటేశ్వర ప్రసాద్ స్పందిస్తూ..... అందులో చూపించిన విషయాలన్నీ వాస్తవాలే అని తెలిపారు. ఈ సినిమా రావడం వల్ల ప్రజలకు వాస్తవాలు తెలిశాయి అనేది తన అభిప్రాయమని కోటేశ్వర ప్రసాద్ చెప్పుకొచ్చారు.

డాక్టర్ కోటేశ్వర ప్రసాద్
ఎన్టీ రామారావు జీవితంలోకి రావడానికి ముందే లక్ష్మి పార్వతి.. వీరగంధం సుబ్బరావు అనే హరికథ కళాకారుడిని పెళ్లాడిన సంగతి తెలిసిందే. ఈ దంపతులకు పుట్టిన కుమారుడే కోశ్వరప్రసాద్. తన మొదటి భర్తకు విడాకులు ఇచ్చిన అనంతరం ఆమె ఎన్టీ రామారావును వివాహం చేసుకున్నారు.