పిచ్చి ఎక్కువైంది: బాలయ్య తీస్తున్న ఎన్టీఆర్ బయోపిక్‌పై లక్ష్మీ పార్వతి
బాలయ్య తెరకెక్కిస్తున్న ఎన్టీఆర్ బయోపిక్ విషయంలో కొన్ని రోజులుగా ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా దర్శకుడిగా తొలుత తేజను ఎంపిక చేయడంతో పాటు నాచారంలోని రామకృష్ణ స్టూడియోలో గ్రాండ్‌గా ఫ్రారంభ వేడుక నిర్వహించారు. అంతే కాదు ఈ వేడుకకు ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడును పిలిపించి మరీ అట్టహాసంగా ఫంక్షన్ నిర్వహించారు. సినిమా పట్టలెక్కింది త్వరలోనే ఎన్టీఆర్ బయోపిక్ చూస్తామనుకునే తరుణంలో ఎవరూ ఊహించని విధంగా తేజ తప్పుకున్నారు. ఈ పరిణామాలపై లక్ష్మి పార్వతి రియాక్ట్ అయ్యారు.

నన్ను ఎవరూ అప్రోచ్ అవ్వలేదు
తాజాగా వైసీపీకి సంబంధించిన పొలిటికల్ ప్రెస్ మీట్లో లక్ష్మి పార్వతి పాల్గొన్న సందర్భంగా ‘ఎన్టీఆర్ బయోపిక్' గురించి ప్రశ్న ఆమెకు ఎదురైంది. దీనిపై లక్ష్మి పార్వతి స్పందిస్తూ బయోపిక్ విషయంలో మావాళ్లు ఎవరూ తనను సంప్రదించ లేదని తెలిపారు.

సినిమా వస్తుందనే నమ్మకం లేదు
‘ఎన్టీఆర్ బయోపిక్' పూర్తవుతుందనే నమ్మకం తనకు లేదని ఈ సందర్భంగా లక్ష్మి పార్వతి వ్యాఖ్యానించారు. సినిమా వస్తుందో? రాదో? అనే సందేహం వ్యక్తం చేశారు.

పిచ్చి ఎక్కువైంది
‘ఎన్టీఆర్ బయోపిక్' విషయంలో దర్శకులే మారిపోతున్నారు. చూస్తుంటే ఆయనకు పిచ్చి ఎక్కువైనట్లు ఉంది అంటూ బాలయ్యను ఉద్దేశించి లక్ష్మి పార్వతి వ్యాఖ్యానించడం చర్చనీయాంశం అయింది.

అక్కడేమో అలా...
లక్ష్మి పార్వతి వ్యాఖ్యలు ఇలా ఉంటే.... తేజ స్థానంలో ఎన్టీఆర్ బయోపిక్‌కు కొత్త దర్శకుడిగా వచ్చిన క్రిష్ జాగర్లమూడి పనులు వేగవంతం చేశారు. ఇటీవల బాలయ్య పుట్టినరోజు సందర్భంగా కొత్త పోస్టర్ సైతం విడుదల చేశారు.

ఎన్టీఆర్ బయోపిక్
వారాహి చలన చిత్రం, యన్‌బికె ఫిల్మ్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. బాలకృష్ణ, సాయి కొర్రపాటి, విష్ణు వర్దన్ ఇందూరి నిర్మాతలు. యం.యం. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. బిఎస్.జ్ఞానశేఖర్, తోట తరణి, సాయి మాధవ్ బుర్ర, సిరివెన్నెల సీతారామ శాస్త్రి తదితరులు ఈ చిత్రానికి పని చేస్తున్నారు. ఈ చిత్రాన్ని సంక్రాంతికి విడుదల చేసే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications











